మత్తుకు పైఎత్తు
మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయి? ఖజానాకు రావాల్సిన ఆదాయానికి మందుబాబులు ఎలా గండికొట్టారు? ఇవన్నీ నాకు తెలియాల్సిందేనంటున్నారు యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో యువ ముఖ్యమంత్రి కలత చెందారట. ఇలాగైతే యూపీ ఖజానా ఖాళీ కావడం ఖాయమని ఆందోళన చెందిన అఖిలేష్..లిక్కర్ సేల్స్ పై అలెర్టవ్వాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఓ పక్క మద్యం మహమ్మారికి రోజూ వందల మంది బలైపోతూన్నారు. మద్యం మత్తులో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. […]
Advertisement
మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయి? ఖజానాకు రావాల్సిన ఆదాయానికి మందుబాబులు ఎలా గండికొట్టారు? ఇవన్నీ నాకు తెలియాల్సిందేనంటున్నారు యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో యువ ముఖ్యమంత్రి కలత చెందారట. ఇలాగైతే యూపీ ఖజానా ఖాళీ కావడం ఖాయమని ఆందోళన చెందిన అఖిలేష్..లిక్కర్ సేల్స్ పై అలెర్టవ్వాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఓ పక్క మద్యం మహమ్మారికి రోజూ వందల మంది బలైపోతూన్నారు. మద్యం మత్తులో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. మత్తులో చిత్తవుతున్నారు పేదలు. ఇన్ని దుష్ఫలితాలకు కారణమైన ఆల్కహాల్ అమ్మకాలు తగ్గితే ఒక సీఎంగా సంతోషం వ్యక్తం చేయాల్సింది పోయి.. లిక్కర్ సేల్స్ తగ్గడానికి కారణాలను అన్వేషించి, అమ్మకాలు పెంచాలని కోరుతూ కలెక్టర్లకు లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది.
Advertisement