లలిత్‌మోడికి అరెస్ట్‌ వారెంట్ ఇవ్వాలి: ఈడీ

ఐపీఎల్ మాజీ క‌మిష‌న‌ర్ ల‌లిత్‌మోడీకి నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ జారీ చేయాల‌ని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విభాగం ముంబై సెష‌న్స్ కోర్టును ఆశ్ర‌యించింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో నిందితుడైన ల‌లిత్‌మోడీని విచారించేందుకు తాము ఇస్తున్న నోటీసులకు స్పందించ‌డం లేద‌ని, నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌ని కోరుతూ కోర్టులో మంగ‌ళ‌వారం ఈడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ముంబైలోని ల‌లిత్ నివాసానికి పంపిన నోటీసులు తిరుగుట‌పాలో వ‌చ్చాయ‌ని, మెయిల్ ఐడీకి కూడా నోటీసులు పంపినా స్పంద‌న లేద‌ని ఈడీ ఆ […]

Advertisement
Update:2015-07-28 07:26 IST
ఐపీఎల్ మాజీ క‌మిష‌న‌ర్ ల‌లిత్‌మోడీకి నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ జారీ చేయాల‌ని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విభాగం ముంబై సెష‌న్స్ కోర్టును ఆశ్ర‌యించింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో నిందితుడైన ల‌లిత్‌మోడీని విచారించేందుకు తాము ఇస్తున్న నోటీసులకు స్పందించ‌డం లేద‌ని, నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌ని కోరుతూ కోర్టులో మంగ‌ళ‌వారం ఈడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ముంబైలోని ల‌లిత్ నివాసానికి పంపిన నోటీసులు తిరుగుట‌పాలో వ‌చ్చాయ‌ని, మెయిల్ ఐడీకి కూడా నోటీసులు పంపినా స్పంద‌న లేద‌ని ఈడీ ఆ పిటిష‌న్‌లో పేర్కొంది. అయితే త‌న‌కు ఎటువంటి నోటీసులు అంద‌లేద‌ని ల‌లిత్ మోడీ ట్వీట్ చేశారు. అందితే స్పందిస్తాన‌ని కూడా అందులో స్ప‌ష్టం చేశారు. మోడీపై ఇప్ప‌టికే ఈడీ 17 కేసులు న‌మోదు చేసింది. ల‌లిత్ త‌ర‌ఫున వాదించడం మానుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని త‌న‌కు హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ని, త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ ల‌లిత్ లాయ‌ర్ మ‌హ‌మూద్ అబ్డి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.
Tags:    
Advertisement

Similar News