మోడీతో బాహుబలి
హీరో ప్రభాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీని గౌరవపూర్వకంగా కలిశాడు. పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మతో కలిసి మోడీని కలిశాడు ప్రభాస్. ఈ సందర్భంగా బాహుబలి సినిమా చూడమని మోడీని రిక్వెస్ట్ చేశాడు ప్రభాస్. దీనికి పాజిటివ్ గా స్పందించారు ప్రధాని. తనకు ఫ్రీ టైం దొరికితే కచ్చితంగా బాహుబలి సినిమా చూస్తానని మాటిచ్చారు. ప్రభాస్-మోడీ భేటీని రాజమౌళి కూడా తన ట్విట్టర్ లో మెచ్చుకున్నాడు. మా అమరేంద్ర బాహుబలి, మోడీని కలవడం చాలా గొప్పవిషయం అని రాసుకొచ్చాడు. […]
Advertisement
హీరో ప్రభాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీని గౌరవపూర్వకంగా కలిశాడు. పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మతో కలిసి మోడీని కలిశాడు ప్రభాస్. ఈ సందర్భంగా బాహుబలి సినిమా చూడమని మోడీని రిక్వెస్ట్ చేశాడు ప్రభాస్. దీనికి పాజిటివ్ గా స్పందించారు ప్రధాని. తనకు ఫ్రీ టైం దొరికితే కచ్చితంగా బాహుబలి సినిమా చూస్తానని మాటిచ్చారు. ప్రభాస్-మోడీ భేటీని రాజమౌళి కూడా తన ట్విట్టర్ లో మెచ్చుకున్నాడు. మా అమరేంద్ర బాహుబలి, మోడీని కలవడం చాలా గొప్పవిషయం అని రాసుకొచ్చాడు. మరోవైపు కేంద్రమంత్రులు చాలామందిని బాహుబలి ఎట్రాక్ట్ చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో పాటు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ .. ఇలా చాలామంది బాహుబలి సినిమాను చూశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రభాస్, ప్రస్తుతానికి తనకు బాలీవుడ్ సినిమా చేసే ఉద్దేశం లేదని ప్రకటించాడు. తన దృష్టంతా బాహుబలి-2 సినిమాపైనే ఉందని స్పష్టంచేశాడు. సెప్టెంబర్ నుంచి బాహుబలి-2 సినిమా సెట్స్ పైకి వస్తుంది.
Advertisement