జర నవ్వండి ప్లీజ్ 156

ముద్దుకొక చీర బట్టలు కొట్టుకు వెళ్లిన అందమైన అమ్మాయి. “చీర ఎంత?” అని అడిగింది. అల్లరి వాడయిన సేల్స్‌బాయ్‌ “ముద్దుకొకటి” అన్నాడు. ఆ అమ్మాయి “పది చీరలివ్వు” అంది. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి పది చీరలు ప్యాక్‌ చేశాడు. ఉత్సాహంగా ఆ అమ్మాయివైపు చూశాడు. ఆ అమ్మాయి ప్యాకెట్‌ తీసుకుని వెనక్కి చూపిస్తూ… “బిల్లు మా తాత చెల్లిస్తాడు” అంది. ————————————————- సందేహం “నాన్నా! అమ్మలో ఏంచూసి పెళ్ళాడావు!” అడిగాడు కొడుకు. “ఐతే నీక్కూడా సందేహం మొదలయిందన్నమాట” […]

Advertisement
Update:2015-07-26 18:33 IST

ముద్దుకొక చీర
బట్టలు కొట్టుకు వెళ్లిన అందమైన అమ్మాయి. “చీర ఎంత?” అని అడిగింది.
అల్లరి వాడయిన సేల్స్‌బాయ్‌ “ముద్దుకొకటి” అన్నాడు.
ఆ అమ్మాయి “పది చీరలివ్వు” అంది.
ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి పది చీరలు ప్యాక్‌ చేశాడు. ఉత్సాహంగా ఆ అమ్మాయివైపు చూశాడు.
ఆ అమ్మాయి ప్యాకెట్‌ తీసుకుని వెనక్కి చూపిస్తూ… “బిల్లు మా తాత చెల్లిస్తాడు” అంది.
————————————————-
సందేహం
“నాన్నా! అమ్మలో ఏంచూసి పెళ్ళాడావు!” అడిగాడు కొడుకు.
“ఐతే నీక్కూడా సందేహం మొదలయిందన్నమాట” అన్నాడు తండ్రి.
————————————————-
సర్దార్జీ తెలివి
లక్ష మైళ్లు తిరిగిన కారును అమ్ముదామని ప్రయత్నిస్తే ఎవరూ కొనలేదని సర్దార్జీ బాధపడుతూ ఉంటే మిత్రుడు సర్దార్జీని ఓదార్చి మీటర్‌ని ముప్పయి వేలు తిరిగినట్లు మార్చి వెళ్లాడు. కొన్నాళ్ల తరువాత మిత్రుడు వచ్చి కారు అమ్మావా? అని అడిగాడు. అందుకు సర్దార్జీ “ముప్పయి వేల మైళ్లే తిరిగిన కారుని అమ్మడానికి నేనేమయినా పిచ్చివాణ్ణా!!” అన్నాడు.

Tags:    
Advertisement

Similar News