మోదీపై కేజ్రీవాల్ పోస్ట‌ర్ల యుద్ధం

ఆప్ స‌ర్కారుకు కేంద్రానికి మ‌ధ్య యుద్ధం తార‌స్థాయికి చేరింది. ఆప్ ప్రభుత్వానికి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పిస్తున్న మోదీ స‌ర్కారుకు వినూత్న నిర‌స‌న తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. “ప్ర‌ధాని జీ మ‌మ్మ‌ల్ని ప‌ని చేసుకోనివ్వండి“ అంటూ ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. ఆమ్ఆద్మీ పార్టీ పేరుతో వేసిన ఈ పోస్ట‌ర్లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌మ ప్ర‌భుత్వం మెరుగ్గా ప‌నిచేస్తోంద‌ని, ద‌య‌చేసి ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని ప‌నిచేయ‌నివ్వండంటూ ప్ర‌ధానికి విన్న‌విస్తూ వేసిన పోస్ట‌ర్లు..అటు ప్ర‌జ‌ల్లో సానుభూతిని..ఇటు కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు […]

Advertisement
Update:2015-07-24 08:40 IST
ఆప్ స‌ర్కారుకు కేంద్రానికి మ‌ధ్య యుద్ధం తార‌స్థాయికి చేరింది. ఆప్ ప్రభుత్వానికి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పిస్తున్న మోదీ స‌ర్కారుకు వినూత్న నిర‌స‌న తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. “ప్ర‌ధాని జీ మ‌మ్మ‌ల్ని ప‌ని చేసుకోనివ్వండి“ అంటూ ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. ఆమ్ఆద్మీ పార్టీ పేరుతో వేసిన ఈ పోస్ట‌ర్లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌మ ప్ర‌భుత్వం మెరుగ్గా ప‌నిచేస్తోంద‌ని, ద‌య‌చేసి ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని ప‌నిచేయ‌నివ్వండంటూ ప్ర‌ధానికి విన్న‌విస్తూ వేసిన పోస్ట‌ర్లు..అటు ప్ర‌జ‌ల్లో సానుభూతిని..ఇటు కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆప్ భావిస్తోంది.
కేజ్రీ వ‌ర‌మిచ్చినా జంగ్ తాళ‌మివ్వ‌లేదు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ‌ర‌మిచ్చినా..లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌జీబ్ జంగ్ కరుణించ‌లేదు. ఢిల్లీ మహిళా కమిషనర్‌గా స్వాతి మలివాల్‌కు కేజ్రీ కుర్చీ ఇచ్చినా.. జంగ్ కార్యాల‌యం తాళం ఇవ్వ‌లేదు. ఆప్‌స‌ర్కారు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదాల‌లో మ‌రో కొత్త వివాదం ఇది. మ‌హిళా క‌మిష‌న‌ర్‌గా ఆప్ స‌ర్కారు ఎంపిక చేసిన స్వాతి మ‌లివాల్ నియామ‌కాన్ని ర‌ద్దు చేస్తూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సీఎం కార్యాల‌యానికి లేఖ పంపారు. అయితే దీనిని ప‌ట్టించుకోకుండా విధుల్లో చేరేందుకు వెళ్లారు స్వాతి మ‌లివాల్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. గురువారం తాను కార్యాలయానికి వెళ్లే సరికి తాళం వేసి ఉందని, బయట ఉన్న నేమ్‌ ప్లేట్‌ను కూడా తొలగించారని ఆరోపిస్తున్నారు స్వాతి. కార్యాలయానికి రావొద్దని బుధవారం తనకు నజీబ్‌ జంగ్‌ ఫోన్‌ చేశారని కూడా స్వాతి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఏసీ ఆఫీసులు, చాంబ‌ర్ల‌లోనే ప‌నిచేయ‌క్క‌ర్లేద‌ని..మ‌హిళ‌ల హ‌క్కుల కోసం తాను పోరాడుతూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు స్వాతి.
Tags:    
Advertisement

Similar News