కలాంకు నివాళులర్పించిన‌ విద్యా మంత్రి!

సాక్ష్యాత్తూ మంత్రులే మహాపరాధం చేస్తుంటే సామాన్యులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. జార్ఖండ్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రిగారి పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పే ఈ సంఘటన చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. 83 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా తిరుగుతున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మరి ఆయన కాలం చేశారని ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కాని ఓ మహిళా మంత్రిగారు ఏకంగా ఆయన ఫొటో పెట్టి దండ వేసి నివాళులర్పించారు. ఘనత […]

Advertisement
Update:2015-07-23 05:18 IST
సాక్ష్యాత్తూ మంత్రులే మహాపరాధం చేస్తుంటే సామాన్యులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. జార్ఖండ్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రిగారి పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పే ఈ సంఘటన చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. 83 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా తిరుగుతున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మరి ఆయన కాలం చేశారని ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కాని ఓ మహిళా మంత్రిగారు ఏకంగా ఆయన ఫొటో పెట్టి దండ వేసి నివాళులర్పించారు. ఘనత వహించిన ఈ మంత్రివర్యుల చర్యకు అక్కడున్న కొంతమంది ముక్కున వేలేసుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన స్మార్ట్‌ క్లాస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు విద్యా శాఖ మంత్రి నీరా యాదవ్. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దివంగత నాయకుల ఫోటోలకు దండ వేసి నివాళులర్పించడం మొదలు పెట్టారు. పనిలోపనిగా ఆ పక్కనే ఉన్న అబ్దుల్ కలాం ఫోటోకు కూడా దండవేసి, బొట్టు పెట్టి నివాళులర్పించేశారు మంత్రిగారు. సాధారణంగా చనిపోయిన వారికే ఇలా చేస్తారు. దీంతో విద్యా మంత్రిగారి విజ్ఞానానికి జనానికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంకయిపోయింది.
Tags:    
Advertisement

Similar News