పార్లమెంట్ ఆవరణలో స్మోకింగ్ రూమ్!
పొగతాగని వాడు దున్నపోతై పుడతాడో లేదో తెలియదు కానీ, పొగతాగేవాళ్లు మాత్రం దాన్ని అదుపు చేసుకోలేరన్నది వాస్తవం. ఇందుకు పార్లమెంటు సభ్యులేం అతీతం కారు. 2004లో అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పార్లమెంట్ ఆవరణను నో స్మోకింగ్ జోన్‌గా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పొగతాగే ఎంపీలంతా సమావేశాలయ్యే దాకా అంకెలు లెక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఉండబట్టలేక మంగళవారం పొగతాగే ఎంపీలంతా కలిసి స్పీకర్‌ను కలిశారంట. తమలాంటి వాళ్ల కోసం ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని […]
Advertisement
పొగతాగని వాడు దున్నపోతై పుడతాడో లేదో తెలియదు కానీ, పొగతాగేవాళ్లు మాత్రం దాన్ని అదుపు చేసుకోలేరన్నది వాస్తవం. ఇందుకు పార్లమెంటు సభ్యులేం అతీతం కారు. 2004లో అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పార్లమెంట్ ఆవరణను నో స్మోకింగ్ జోన్‌గా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పొగతాగే ఎంపీలంతా సమావేశాలయ్యే దాకా అంకెలు లెక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఉండబట్టలేక మంగళవారం పొగతాగే ఎంపీలంతా కలిసి స్పీకర్‌ను కలిశారంట. తమలాంటి వాళ్ల కోసం ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారంట. ఎంపీల అభ్యర్థనను స్పీకర్ కూడా ధ్రువీకరించారు. స్మోకింగ్ కోసం ఎంపీలు ప్రత్యేక గదిని కోరిన మాట వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. అయితే ధూమపానాన్ని వదిలేయాలని తాను వారికి సూచించానని కూడా స్పీకర్ తెలిపారు.
Advertisement