బాహుబలిపై సల్మాన్ అభిమానుల దాడి

బాహుబలి విడుదలైన వారం రోజులకే సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే అంతా ఊహించినట్టు సల్మాన్ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటికీ.. బాహుబలి మాత్రం ఖాళీ చేయలేదు. చాలా స్క్రీన్స్ లో బాహుబలి సినిమాను ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి వసూళ్లతో బాహుబలి సినిమా దూసుకుపోతోంది. నిజం చెప్పాలంటే సల్మాన్ సినిమాకు కొన్ని ఏరియాల్లో థియేటర్లు లేకుండా చేసింది బాహుబలి. చెప్పుకోవడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ […]

Advertisement
Update:2015-07-21 06:44 IST
బాహుబలిపై సల్మాన్ అభిమానుల దాడి
  • whatsapp icon
బాహుబలి విడుదలైన వారం రోజులకే సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే అంతా ఊహించినట్టు సల్మాన్ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటికీ.. బాహుబలి మాత్రం ఖాళీ చేయలేదు. చాలా స్క్రీన్స్ లో బాహుబలి సినిమాను ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి వసూళ్లతో బాహుబలి సినిమా దూసుకుపోతోంది. నిజం చెప్పాలంటే సల్మాన్ సినిమాకు కొన్ని ఏరియాల్లో థియేటర్లు లేకుండా చేసింది బాహుబలి. చెప్పుకోవడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో ఇలా జరిగింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. తమ అభిమాన హీరో సినిమాకు థియేటర్లు ఇవ్వరా అంటూ బాహుబలి ప్రదర్శితమౌతున్న థియేటర్లపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే హర్యానా, యూపీలోని కొన్ని థియేటర్లపై దాడులు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 40శాతానికి పైగా థియేటర్లలో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ లాంటి చాలా రాష్ట్రాల్లో మాత్రం సల్మాన్ కోసం బాహుబలిని ఎత్తేశారు. మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ.. అప్పటికే చేసుకున్న ఒప్పుందం ప్రకారం సల్మాన్ మూవీకే థియేటర్లు కేటాయించారు.
Tags:    
Advertisement

Similar News