భర్తను షేవింగ్‌కు పంపి పెళ్లి కూతురు జంప్ జిలానీ
ఏవండీ మీరు గెడ్డం తీసేసి నున్నగా షేవింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటారు. మీరు ఈ సెలూన్‌లో షేవ్ చేసుకురండి. ఈలోగా నేనిక్కడ సేద తీరతా… అంటూ లాలనగా అడిగితే ఏ భర్త మాత్రం కాదంటాడు. భార్య మీద ఉన్న ప్రేమ నమ్మకమే తన కొంప ముంచిందని, తన భార్య ఇద్దరు ఆడవాళ్లతో కలిసి పారిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు ఓ కొత్త పెళ్లి కొడుకు, దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన ఓ అమాయక పెళ్ళికొడుకు జీవితంలో తారసపడింది. […]
Advertisement
ఏవండీ మీరు గెడ్డం తీసేసి నున్నగా షేవింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటారు. మీరు ఈ సెలూన్‌లో షేవ్ చేసుకురండి. ఈలోగా నేనిక్కడ సేద తీరతా… అంటూ లాలనగా అడిగితే ఏ భర్త మాత్రం కాదంటాడు. భార్య మీద ఉన్న ప్రేమ నమ్మకమే తన కొంప ముంచిందని, తన భార్య ఇద్దరు ఆడవాళ్లతో కలిసి పారిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు ఓ కొత్త పెళ్లి కొడుకు, దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన ఓ అమాయక పెళ్ళికొడుకు జీవితంలో తారసపడింది. రాజస్థాన్‌లో పెళ్ళి చేసుకునేందుకు యువకులకు యువతులే దొరకడం కనాకష్టమై పోతోంది. దీంతో అక్కడ ముదురు బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతోంది. అతికష్టం మీద ఆడపిల్లలకు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కాని బ్రహ్మచారులు. కొత్త భార్యల ముద్దూముచ్చట్లు తీర్చడానికే తమ దగ్గరున్న సర్వం ధార పోస్తున్నారు. సరిగ్గా పెళ్లికొడుకుల బలహీనతను రాజస్థాన్ అమ్మాయిలు ఎంచక్కా వాడేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో డబ్బూ దస్కం అతడి వద్ద నుంచి గుంజేసి ఎంచక్కా జంప్ అవుతున్నారు. రాజస్థాన్‌లోని రిషా బెహెడోకు చెందిన దినేష్ జోషి తనకు మంచి పెళ్లి సంబంధాలు చూడమని అదే గ్రామానికి చెందిన ఆత్మారాం జోషి అనే మధ్యవర్తిని కోరాడు. ఆత్మారాం దినేష్‌కు పుష్ప అనే అమ్మాయితో సంబంధం కుదిర్చాడు. దినేష్ పెళ్లి కూతురు తల్లిదండ్రులకు రూ. లక్షన్నర కన్యాశుల్కంగా నగదు రూపంలో చెల్లించాడు. పెళ్లి సంబంధం కుదిర్చినందుకు ఆత్మారాంకు మరో యాభై వేలు ముట్టచెప్పి బంధుమిత్రుల సమక్షంలో పుష్పను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన వెంటనే హనీమూన్‌కు ఉదయ్‌పూర్‌కు వెళదామని పుష్ప పట్టుబట్టడంతో దినేష్ సరేనని అంగీకరించాడు. ఉదయ్‌పూర్‌లో కొద్ది రోజులు గడిపిన తర్వాత శుక్రవారం ఉదయం పుష్ప దినేష్‌ను నీట్ షేవ్ చేసుకోమని సెలూన్ చూపించింది. అతడు వచ్చే వరకు సెలూన్ బైట ఎదురు చూస్తానని చెప్పిన పుష్ప సెలూన్ లోనుంచి అతడు చూస్తుండగానే, ఆటోలో వచ్చిన ఇద్దరు ఆడవాళ్లతో కలిసి ఉడాయించింది. దీంతో పెళ్లికొడుకు సురాజ్‌పాల్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించాడు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం వలన రాష్ట్రంలో తరచూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
Advertisement