జర నవ్వండి ప్లీజ్ 149
కుక్కఅనలేదు… మొరగొద్దు…! “నువ్వు నన్ను కుక్క అన్నవా?” “మాట్లాడవేం?” “నువ్వు నన్ను కుక్క అన్నావా?” “నిన్నే అడుగుతున్నది. నువ్వు నన్ను అలా కుక్క అన్నావా?” “అనలేదు… ఇక మొరుగుడు మానుతావా!” ——————————————————————— ప్రేమతో “నీకు నామీద ప్రేమ ఉంటే పెళ్లిలో కట్నం మాట ఎత్తవు కదా” అంది ఫెమినిస్టు ప్రభ సూర్యంతో. “అసలు పెళ్లి మాటే ఎత్తను” అన్నాడు సూర్యం. ——————————————————————— సైలెంట్ మోడ్ “సెల్‌ఫోన్‌కూ గర్ల్‌ఫ్రెండ్‌కు తేడా ఏమిటంటావ్?” అడిగాడు పార్వతీశం సుందరసాయిని. “సెల్‌ఫోన్ అయితే […]
కుక్కఅనలేదు… మొరగొద్దు…!
“నువ్వు నన్ను కుక్క అన్నవా?”
“మాట్లాడవేం?”
“నువ్వు నన్ను కుక్క అన్నావా?”
“నిన్నే అడుగుతున్నది. నువ్వు నన్ను అలా కుక్క అన్నావా?”
“అనలేదు… ఇక మొరుగుడు మానుతావా!”
———————————————————————
ప్రేమతో
“నీకు నామీద ప్రేమ ఉంటే పెళ్లిలో కట్నం మాట ఎత్తవు కదా” అంది ఫెమినిస్టు ప్రభ సూర్యంతో.
“అసలు పెళ్లి మాటే ఎత్తను” అన్నాడు సూర్యం.
———————————————————————
సైలెంట్ మోడ్
“సెల్‌ఫోన్‌కూ గర్ల్‌ఫ్రెండ్‌కు తేడా ఏమిటంటావ్?” అడిగాడు పార్వతీశం సుందరసాయిని.
“సెల్‌ఫోన్ అయితే “సైలెంట్ మోడ్”లో పెట్టవచ్చు. గర్ల్‌ఫ్రెండ్‌ని పెట్టలేం కదా!” అన్నాడు సాయి.
———————————————————————
కుదరని పని
ఆఫీసర్: “ఏమిటోయ్ సూర్యం నీ సీటు వదిలేసి పొద్దుట్నుంచీ ఎక్కడ తిరుగుతున్నావ్”
సూర్యం: “ఆ! ఆ సీటు కూడా వెంటబెట్టుకుని తిరగడం ఎలా కుదురుతుంది. సార్? అది బాగా బరువు కూడాను అందుకే వదిలేశా.”