కాశ్మీర్‌లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు... పోలీసు కాల్పులు
జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటు వాదులు మరోసారి బరి తెగించారు. సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాక్ జెండాలను, ఐఎస్ఐఎస్ పతాకాలను ఎగుర వేయడంతో సరిహద్దు భద్రతా దళాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. వేర్పాటు వాదులను తుద ముట్టించాలని ఓ వర్గం డిమాండు చేస్తోంది. భారత సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపిన వివాదం సద్దుమణగకముందే శ్రీనగర్లో మరోసారి ఇలా వేర్పాటు వాదులు రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది యువకులు శ్రీనగర్ వీధుల్లో పాకిస్థాన్, లష్కరే […]
Advertisement
జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటు వాదులు మరోసారి బరి తెగించారు. సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాక్ జెండాలను, ఐఎస్ఐఎస్ పతాకాలను ఎగుర వేయడంతో సరిహద్దు భద్రతా దళాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. వేర్పాటు వాదులను తుద ముట్టించాలని ఓ వర్గం డిమాండు చేస్తోంది. భారత సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపిన వివాదం సద్దుమణగకముందే శ్రీనగర్లో మరోసారి ఇలా వేర్పాటు వాదులు రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది యువకులు శ్రీనగర్ వీధుల్లో పాకిస్థాన్, లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ పాక్ అనుకూల నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసులతో ఘర్షణకు దిగారు. దాంతో పోలీసులు సీఆర్పీఎఫ్‌తో పాటు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. వీరు పరిస్థితిని అదుపులో పెట్టేందుకు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. జమ్మూకాశ్మీర్‌లో మరోసారి హింస చెలరేగే అవకాశముందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గిలానీని గృహ నిర్భంధంలో ఉంచడంతో హింస చెలరేగిపోయింది. శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వ మెతక వైఖరే కారణమని ప్రతిపక్షాలు ఆరోపించగా, ప్రభుత్వం వాటిని తిప్పి కొట్టింది. అధికారం కోసం తాము అర్రులు చాచడం లేదని, రాష్ట్ర ప్రజల శాంతిభద్రతలే ముఖ్యమని సీఎం ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితులకు ముగింపు పలికేందుకే బీజేపీతో మైత్రి ఏర్పరుచుకున్నామని ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రకటించారు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రధానితో కలిసి పాల్గొన్న డోగ్రా స్మారకోపన్యాసంలో అన్నారు.
బీజేపీ-పీడీపీ ప్రభుత్వాల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉగ్రవాదులకు కృతజ్ఞతలు తెలిపి అతని మనసులో ఏముందో తెలియజేశాడు. స్వయంగా ముఖ్యమంత్రి వేర్పాటువాదులకు, పాక్ ఉగ్రవాదులకు వంగి నమస్కారాలు చేస్తే, వారుమాత్రం ఎందుకు ఊరుకుంటారు? అందుకే కాశ్మీర్‌లో వేర్పాటువాదులు చెలరేగుతున్నారు. శుక్రవారం మోదీ పర్యటన సందర్భంగా మరోసారి పాక్, ఐఎస్ఐఎస్ జెండాలతో నిరసన ర్యాలీలు తీశారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. రాళ్లురువ్వారు. ఈఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ నిర్లక్ష్యం వల్లే కాశ్మీర్‌లో అల్లరిమూకలు చెలరేగుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇలాంటి ఘటన జరగడం రెండునెలల కాలంలో రెండోసారి. గతంలో ఐఎస్ జెండాలు ఎగిరినపుడే కేంద్రం దీనిపై సీరియస్ అయింది. కాశ్మీర్‌ను దీనిపై నివేదిక కోరింది. ఓ వైపు మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కూడగడుతుండటం అభినందనీయమే! కానీ, వారి పార్టీ అండతో అధికారంలో ఉన్న కాశ్మీర్‌లో దేశ సమగ్రతకు సవాలు విసురుతున్న ఇలాంటి ఘటనలతో బీజేపీ-మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. దేశభక్తులమని చెప్పుకునే కమలనాథుల పార్టీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కలిగిన వ్యక్తితో అంటకాగడాన్ని దేశప్రజల్లో మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
Advertisement