జర నవ్వండి ప్లీజ్ 146
అద్దాలు “నాకు మూడు జతల అద్దాలు కావాలి.” “మూడెందుకు?” “ఒకటి దూరంగా ఉన్నవి చూడ్డానికి, రెండోది దగ్గరగా ఉన్నవి చూడ్డానికి.” “మరి మూడోది.” “ఆ రెండూ ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి.” ——————————————————————— స్వప్న ఫలం భార్య: రాత్రి నాకు కలవచ్చింది. మీరు నాకు వజ్రాల నెక్లెస్ వేలెంటైన్స్ డేకి ప్రజెంట్ చేసినట్లు కలవచ్చింది. దీని అర్థమేమిటి? భర్త: దాని అర్థం నీకు రాత్రికి తెలుస్తుంది. అని సాయంత్రం బయటికి వెళ్లి ఒక గిఫ్ట్‌ప్యాక్ తీసుకొచ్చాడు. భార్య ఆనందంగా […]
అద్దాలు
“నాకు మూడు జతల అద్దాలు కావాలి.”
“మూడెందుకు?”
“ఒకటి దూరంగా ఉన్నవి చూడ్డానికి, రెండోది దగ్గరగా ఉన్నవి చూడ్డానికి.”
“మరి మూడోది.”
“ఆ రెండూ ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి.”
———————————————————————
స్వప్న ఫలం
భార్య: రాత్రి నాకు కలవచ్చింది. మీరు నాకు వజ్రాల నెక్లెస్ వేలెంటైన్స్ డేకి ప్రజెంట్ చేసినట్లు కలవచ్చింది. దీని అర్థమేమిటి?
భర్త: దాని అర్థం నీకు రాత్రికి తెలుస్తుంది. అని సాయంత్రం బయటికి వెళ్లి ఒక గిఫ్ట్‌ప్యాక్ తీసుకొచ్చాడు.
భార్య ఆనందంగా ఆ ప్యాక్ విప్పి చూసింది.
అందులో ఒక పుస్తకముంది. దాని పేరు “ది మీనింగ్ ఆఫ్ డ్రీమ్స్”.
———————————————————————
టీచర్
టీచర్: ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు?
స్టూడెంట్స్: టీచర్!
———————————————————————
చూపు
టీచర్: మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా?
వెంకట్: పక్షుల చూపే బలమైంది.
టీచర్: ఎందుకు
వెంకట్: పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా?