ఆటో డ్రైవర్‌పై మహిళల అత్యాచారయత్నం
బలహీనులైన ఆడవారిపై దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ, దేశరాజధానిలో ఓ మగాడిపై ఇద్దరు మహిళలు అత్యాచారం యత్నంచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. జంబలకిడి పంబ సినిమాలో సన్నివేశాలు గుర్తుకువస్తున్నాయి కదా! ఆ వివరాలు మీరే చదవండి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో బుధవారం రేణు లాల్వానీ(32) అనే మహిళ ఓ ఆటో వద్దకు వచ్చింది. అర్జున్ నగర్‌కు కిరాయి మాట్లాడింది. బేరం కుదరగానే ఆటో డ్రైవర్ ఉమేష్ ప్రసాద్(41) రేణుని ఎక్కించుకుని అర్జున్‌నగర్ చేరుకున్నారు. కిరాయి […]
Advertisement
బలహీనులైన ఆడవారిపై దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ, దేశరాజధానిలో ఓ మగాడిపై ఇద్దరు మహిళలు అత్యాచారం యత్నంచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. జంబలకిడి పంబ సినిమాలో సన్నివేశాలు గుర్తుకువస్తున్నాయి కదా! ఆ వివరాలు మీరే చదవండి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో బుధవారం రేణు లాల్వానీ(32) అనే మహిళ ఓ ఆటో వద్దకు వచ్చింది. అర్జున్ నగర్‌కు కిరాయి మాట్లాడింది. బేరం కుదరగానే ఆటో డ్రైవర్ ఉమేష్ ప్రసాద్(41) రేణుని ఎక్కించుకుని అర్జున్‌నగర్ చేరుకున్నారు. కిరాయి ఇస్తాను రమ్మని ఇంట్లోకి పిలిచింది. ఉమేశ్ వెళ్లగానే గడియ పెట్టింది. అతనికి బలవంతంగా వైన్ తాగించి, అతని బట్టలు విప్పి అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో పక్కగదిలో ఉన్న మరో మహిళతో మాట్లాడేందుకు వెళ్లింది. ఇదే అదనుగా ఆటోడ్రైవర్ తప్పించుకుని వచ్చాడు. ఈక్రమంలో అతని రెండు కాళ్లకు గా తీవ్ర గాయాలయాయ్యాయి. పోలీసులు రేణు నివాసంలో మరో మహిళను టాంజెనియా దేశస్థురాలైన హితిజగా పోలీసులు గుర్తించారు. ఆమె పరారీలో ఉంది.
Advertisement