ఏది అదృశ్యం? (Devotional)

ఒక వ్యక్తి ఒక ప్రసిద్ధుడయిన సూఫీ దగ్గరకు వెళ్ళి “ఏది అదృశ్యం? కనిపించనిది అని మనం దేన్నంటామో అది ఏది?” అని అడిగాడు. సూఫీ అతన్ని చూసి “నీ ప్రశ్నకు నేను సమాధానమిస్తాను. ఎప్పుడంటే అవకాశం వచ్చినపుడు, ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చినపుడు” అన్నాడు. సూఫీలు ప్రదర్శనలకు, అవకాశాలకు చూస్తారు. వాటిని విశ్వసిస్తారు. అంతదాకా ఒక మాటమాట్లాడరు, నోరు విప్పరు. ఏ సూఫీ గురువు నడిగినా సరయిన సమయం రానీ అంటారు. కొంత కాలం గడిచింది. ఒకరోజు కొంతమంది […]

Advertisement
Update:2015-07-16 18:31 IST

ఒక వ్యక్తి ఒక ప్రసిద్ధుడయిన సూఫీ దగ్గరకు వెళ్ళి “ఏది అదృశ్యం? కనిపించనిది అని మనం దేన్నంటామో అది ఏది?” అని అడిగాడు.

సూఫీ అతన్ని చూసి “నీ ప్రశ్నకు నేను సమాధానమిస్తాను. ఎప్పుడంటే అవకాశం వచ్చినపుడు, ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చినపుడు” అన్నాడు.

సూఫీలు ప్రదర్శనలకు, అవకాశాలకు చూస్తారు. వాటిని విశ్వసిస్తారు. అంతదాకా ఒక మాటమాట్లాడరు, నోరు విప్పరు. ఏ సూఫీ గురువు నడిగినా సరయిన సమయం రానీ అంటారు.

కొంత కాలం గడిచింది.

ఒకరోజు కొంతమంది సైనికులు హడావుడిగా వస్తున్నారు. అప్పుడు ప్రశ్నఅడిగిన వ్యక్తి, సూపీ గురువు ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నారు. ఆ సైన్యం వచ్చి వాళ్ళముందు ఆగింది. వాళ్ళనించీ ఒక సైనికాధికారి ముందుకు వచ్చి “మేము దర్వీష్‌ల నందర్నీ బంధించమని మాకు రాజుగారి నించి ఆజ్ఞ వచ్చింది. కారణం వాళ్ళు జనాలలో విశ్వాసాన్ని పోగొడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రాజుగారు ఆగ్రహించారు. అందుకని కనిపించిన సూపీల నందర్నీ జైళ్ళలో వెయ్యమని చెప్పారు” అన్నాడు.

సూఫీ పక్కనున్న వ్యక్తితో “అవకాశం వచ్చినపుడు ప్రదర్శించే సందర్భం వచ్చినపుడు నీకు అదృశ్యం గురించి చెబుతానన్నాను కదా” అన్నాడు.

ఆ వ్యక్తి “అవును” అన్నాడు.

సూఫీ సైనికాధికారితో “మీ పని మీరు చేయండి” అన్నాడు.

సైనికాధికారి “నువ్వు సూఫీవి కాదు కదా!” అన్నాడు.

సూఫీ “అవునో కాదో మీ రెట్లా నిర్ణయిస్తారు, పరీక్షించండి” అన్నాడు.

సైనికాధికారి సైనికుల్తో చెప్పి ఒక పుస్తకం తెమ్మన్నాడు. అది సూఫీ గ్రంథం.

ఆ గ్రంథాన్ని సూఫీలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవిస్తారు.

దాన్ని సూఫీలు “గ్రంథాలకే గ్రంథం” అంటారు.

అంటే అంత గొప్పదని అర్థం.

దాన్ని చూసిన మరుక్షణమే సూఫీలు తలవంచి నమస్కరిస్తారు. అది గొప్ప సూఫీ గ్రంథం.

సూఫీ దాన్ని చూసి “ఏమిటిది?” అన్నాడు.

దాన్నెపుడూ చూడనట్లే ప్రశ్నించాడు.

సూఫీ ఆ గ్రంథాన్ని తీసుకుని ఇటూ అటూ తిప్పిచూశాడు.

సూఫీ “మీకు అభ్యతరం లేకపోతే దీన్ని తగలబెడతాను” అని ఆ గ్రంథాన్ని వాళ్ళముందే కాల్చేశాడు.

అతను సూఫీ కాదని, సూపీ అయితే ఆ పని చేయడని నిర్ధారించుకుని సైనికులు అక్కడినించీ వెళ్ళిపోయారు.

సూఫీ పక్కనున్న వ్యక్తి “మీరు చేసిన పనికి ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు.

“మనల్ని అదృశ్యం చెయ్యడం” అన్నాడు. ఇంకా “ప్రపంచంలో మనుషులకు తాము అనుకున్నది కళ్ళకు కనిపిస్తే దాన్ని వాస్తవ మనుకుంటారు. నువ్వు వేరుగా కనిపిస్తే నీ నిజమైన తత్వం వాళ్ళకు అదృశ్యంగానే ఉండిపోతుంది” అన్నాడు.

ఆ వ్యక్తి ఆశ్చర్యంగా విన్నాడు.

సూఫీ “నేను సూఫీల పవిత్ర గ్రంథమయిన గ్రంథాలకే గ్రంథాన్ని తగలబెట్టడమన్నది సైనికులకు నమ్మశక్యం కానిది. వాళ్ళు ఆ పవిత్ర గ్రంథానికి ప్రణమిల్లి భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తానని ఊహించారు. అట్లా చేయని వాణ్ణి సూఫీగా అంగీకరించరు. ఆ రకంగా నేను వాళ్ళకు అదృశ్యంగా మిగిలిపోయాను” అన్నాడు.

అదృశ్యమంటే తెలుసుకున్న ఆ వ్యక్తి సూఫీకి నమస్కరించాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News