జర నవ్వండి ప్లీజ్ 144

చదువు చెప్పిన సన్నాసి మాస్టారు: రమేశ్‌! నీ ప్రోగ్రెస్‌ కార్డులో సున్నాలొచ్చాయి కదా! మీ నాన్న ఏమన్నాడు? రమేశ్‌: “నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా?” అన్నాడు సార్‌. ——————————————————- పండగ భార్య: అక్కడ తాగుతూ ఉన్న అతన్ని చూశారా! ఐదేళ్ల క్రితం అతన్ని నేను తిరస్కరించాను. భర్త: అదృష్టవంతుడు, అప్పటి నుంచీ సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. ——————————————————- హక్కు టీచర్‌ మంచీ చెడ్డా గురించి పిల్లలకు చెబుతోంది. “పిల్లలూ! ఉదాహరణకి ఒక వ్యక్తి పాకెట్‌లో చేయిపెట్టి అతని […]

Advertisement
Update:2015-07-14 18:33 IST

చదువు చెప్పిన సన్నాసి
మాస్టారు: రమేశ్‌! నీ ప్రోగ్రెస్‌ కార్డులో సున్నాలొచ్చాయి కదా! మీ నాన్న ఏమన్నాడు?
రమేశ్‌: “నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా?” అన్నాడు సార్‌.
——————————————————-
పండగ
భార్య: అక్కడ తాగుతూ ఉన్న అతన్ని చూశారా! ఐదేళ్ల క్రితం అతన్ని నేను తిరస్కరించాను.
భర్త: అదృష్టవంతుడు, అప్పటి నుంచీ సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు.
——————————————————-
హక్కు
టీచర్‌ మంచీ చెడ్డా గురించి పిల్లలకు చెబుతోంది.
“పిల్లలూ! ఉదాహరణకి ఒక వ్యక్తి పాకెట్‌లో చేయిపెట్టి అతని పర్సు తీసుకున్నాననుకోండి నన్నేమంటారు?” అంది.
పిల్లలంతా “అతని భార్య” అన్నారు.
——————————————————-
పాత-కొత్త
మ్యూజియం అధికారి రాజుతో “ఎంత పని చేశావయ్యా! ఐదువందల ఏళ్ల క్రితం విగ్రహాన్ని పగలగొట్టావే!” అన్నాడు.
రాజు ఊపిరి పీల్చుకుని “ఔనా! నేనింకా కొత్తదేమో అనుకుని బయపడ్డాను” అన్నాడు.

Tags:    
Advertisement

Similar News