జర నవ్వండి ప్లీజ్ 143

నరకం ఒక వ్యాపారస్థుడు నరకానికి వెళ్ళి అక్కడున్న తలుపు తట్టాడు. తలుపు తీసిన చిత్రగుప్తుడు అతన్ని చూసి “నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?” అన్నాడు. “నాకు అప్పుపడిన కస్టమర్లు ఇక్కడున్నారు. వసూలు కోసం వచ్చాను” అన్నాడు. “వాళ్లు ఇక్కడే ఉంటారని నీకెలా తెలుసు?” వాళ్లెప్పుడూ “నరకం చూపిస్తున్నావు. అక్కడికే వచ్చి కలెక్టు చేసుకో” అనేవాళ్లు. ———————————————————————– తాగితేగానీ తన్నలేను… “రోజూ రాత్రి తాగి వెళతావెందుకు?” అనడిగాడు నాయుడు. “మా ఆవిడని తన్నటానికి” బదులిచ్చాడు రాయుడు. “భార్యను తన్నటానికి “మందు” […]

Advertisement
Update:2015-07-13 18:33 IST

నరకం
ఒక వ్యాపారస్థుడు నరకానికి వెళ్ళి అక్కడున్న తలుపు తట్టాడు.
తలుపు తీసిన చిత్రగుప్తుడు అతన్ని చూసి “నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?” అన్నాడు.
“నాకు అప్పుపడిన కస్టమర్లు ఇక్కడున్నారు. వసూలు కోసం వచ్చాను” అన్నాడు.
“వాళ్లు ఇక్కడే ఉంటారని నీకెలా తెలుసు?”
వాళ్లెప్పుడూ “నరకం చూపిస్తున్నావు. అక్కడికే వచ్చి కలెక్టు చేసుకో” అనేవాళ్లు.
———————————————————————–
తాగితేగానీ తన్నలేను…

“రోజూ రాత్రి తాగి వెళతావెందుకు?” అనడిగాడు నాయుడు.
“మా ఆవిడని తన్నటానికి” బదులిచ్చాడు రాయుడు.
“భార్యను తన్నటానికి “మందు” తాగి వెళ్లాలా!” ఆశ్చర్యపోయాడు నాయుడు.
“తాగకుండా వెళితే ఆమే నన్ను తంతుంది” చల్లగా చెప్పాడు రాయుడు.
———————————————————————–
“చావు”కబురు చల్లగా…
రోగి: డాక్టర్‌గారూ! నాకు బతకాలని లేదు.
డాక్టర్‌: ఓస్‌..అంతేనా..నీ కోరిక నేను తీరుస్తా కదా!
———————————————————————–
తాగుడు చేసిన హత్య
జడ్జి: నీ తాగుడు వ్యసనం మూలంగానే ఈ హత్య జరిగింది! తెలుసా?
ముద్దాయి: హమ్మయ్య! హత్య నేను చేయలేదని మీరైనా అర్థం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News