జర నవ్వండి ప్లీజ్ 142
“నగ్న”సత్యం రిపోర్టర్: మీరు ఆ సినిమాలో నగ్నంగా నటించారెందుకు? హీరోయిన్: నేను నటించలేదు. హీరో నేను నగ్నంగా ఉన్నట్టు కల కన్నాడంతే! ———————————————————————– సౌండ్‌లో గొడవ “మీ ఇంట్లో టీవీ సౌండ్ కొద్దిగా తగ్గించాలి” అన్నాడు రమణ “ఏం…! నేనూ నా భార్యా పోట్లాడుకుంటే విందామనా” ప్రశ్నించాడు శ్రీనివాస్ ———————————————————————– కోతి చేష్టలు టీచర్: మనిషి కోతి నుంచి వివిధ దశల్లో మానవుడిగా రూపాంతరం చెందాడు. కొన్ని జీవులు ఇంకా రూపాంతరం చెందలేదు. విద్యార్థి: సార్! ఆ […]
“నగ్న”సత్యం
రిపోర్టర్: మీరు ఆ సినిమాలో నగ్నంగా నటించారెందుకు?
హీరోయిన్: నేను నటించలేదు. హీరో నేను నగ్నంగా ఉన్నట్టు కల కన్నాడంతే!
———————————————————————–
సౌండ్‌లో గొడవ
“మీ ఇంట్లో టీవీ సౌండ్ కొద్దిగా తగ్గించాలి” అన్నాడు రమణ
“ఏం…! నేనూ నా భార్యా పోట్లాడుకుంటే విందామనా” ప్రశ్నించాడు శ్రీనివాస్
———————————————————————–
కోతి చేష్టలు
టీచర్: మనిషి కోతి నుంచి వివిధ దశల్లో మానవుడిగా రూపాంతరం చెందాడు.
కొన్ని జీవులు ఇంకా రూపాంతరం చెందలేదు.
విద్యార్థి: సార్! ఆ జీవులు ఎక్కడ ఉన్నాయి?
టీచర్: మన తరగతి గదిలోనే ఉన్నాయి. అందులో నువ్వూ ఒకడివి!
———————————————————————–
నిజంగా అబద్ధం
“అబద్ధాలు చెప్పొద్దని, నీకిప్పటికి పదిసార్లు చెప్పా!” అంటూ కొడుకుని మందలించాడు తండ్రి.
“నాన్నా మీరే అబద్ధాలు చెబుతున్నారు! మీరు ఇప్పటి వరకు నాకు చెప్పింది రెండుసార్లే” గుర్తు చేశాడు కొడుకు