జర నవ్వండి ప్లీజ్ 135

ఎలక్షన్‌ టైంలో ఒక రాజకీయనాయకుడు ప్రచారానికి వచ్చి ఒకరి ఇంటి తలుపు తట్టాడు. ఒక చిన్ని కుర్రాడు తలుపు తీశాడు. రాజకీయనాయకుడు ముద్దుగా “బాబూ! మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నారా? బి.జె.పిలో ఉన్నారా?” అని అడిగాడు. ఆ కుర్రాడు “రెండిట్లోనూ లేరు, బాత్‌రూంలో ఉన్నారు” అన్నాడు. —————————————————————————————————————— ఒక టీనేజర్‌ కుర్రాడు ఇల్లు వదిలిపోవాలనుకున్నాడు. “నాకీ చైతన్యం లేని జీవితం విసుగుపుడుతోంది. నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. అందమయిన అమ్మాయిల్తో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. నేను కోరుకునేదేదీ ఇక్కడ ఈ […]

Advertisement
Update:2015-07-05 18:33 IST

ఎలక్షన్‌ టైంలో ఒక రాజకీయనాయకుడు ప్రచారానికి వచ్చి ఒకరి ఇంటి తలుపు తట్టాడు. ఒక చిన్ని కుర్రాడు తలుపు తీశాడు.
రాజకీయనాయకుడు ముద్దుగా “బాబూ! మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నారా? బి.జె.పిలో ఉన్నారా?” అని అడిగాడు.
ఆ కుర్రాడు “రెండిట్లోనూ లేరు, బాత్‌రూంలో ఉన్నారు” అన్నాడు.
——————————————————————————————————————
ఒక టీనేజర్‌ కుర్రాడు ఇల్లు వదిలిపోవాలనుకున్నాడు.
“నాకీ చైతన్యం లేని జీవితం విసుగుపుడుతోంది. నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. అందమయిన అమ్మాయిల్తో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. నేను కోరుకునేదేదీ ఇక్కడ ఈ ఇంట్లో నాకు దొరకడం లేదు. అందుకని ఈ ఇంట్లోనించి వెళ్ళిపోతున్నాను” అని ఇల్లు దాటి కాంపౌండ్‌ గేటు తీయబోతూ ఉంటే
“బాబూ!” అని తండ్రి పిలిచాడు.
“డాడీ! నన్ను ఆపకు?” అన్నాడు కొడుకు.
“లేదు బాబూ! నిన్ను ఆపడం లేదు, కాస్త ఆగు నేను కూడా నీతో వచ్చేస్తున్నా” అన్నాడు.
——————————————————————————————————————
టీచర్‌: ఒకతను గాడిదను కొడుతూ వుంటే నేను వెళ్ళి ఆపాననుకోండి. దానికి కారణమేమిటి?
స్టూడెంట్‌: సోదర ప్రేమ
——————————————————————————————————————
టీచర్‌: ఈ క్లాసులో తెలివి తక్కువ వాళ్ళెవరో నిలబడండి.
ఎవరూ నిల్చోలేదు, ఐదు నిముషాలకు రఘు నిలబడ్డాడు.
టీచర్‌: వెరీగుడ్‌. నువ్వు తెలివి తక్కువ వాడివా?
రఘు: కాదు టీచర్‌. మీరొక్కరు నిల్చోవడం బాగాలేదని కంపెనీకి లేచాను.

Tags:    
Advertisement

Similar News