వ్యాపమ్ స్కాంలో 47కు చేరిన మృతులు
వ్యాపమ్‌లో ఎన్ని దారుణాలు జరిగాయోగాని దీనిపై విచారణ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటివరకు 47 మంది అనుమానాస్పదంగా దుర్మరణం పాలయ్యారు. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారు, సాక్షులు, ఆఖరికి స్కామ్‌ను వెలికి తీస్తున్న జర్నలిస్టులు సయితం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జబల్‌పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ ఢిల్లీలోని ఉప్పల్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఈ స్కామ్‌ను విచారిస్తున్న కమిటీలో సభ్యుడు. అంతకుముందు ఈ కుంభకోణాన్ని వెలుగుతీసేందుకు ప్రయత్నించిన విలేకరి ఆకస్మికంగా మృతి […]
Advertisement
వ్యాపమ్‌లో ఎన్ని దారుణాలు జరిగాయోగాని దీనిపై విచారణ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటివరకు 47 మంది అనుమానాస్పదంగా దుర్మరణం పాలయ్యారు. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారు, సాక్షులు, ఆఖరికి స్కామ్‌ను వెలికి తీస్తున్న జర్నలిస్టులు సయితం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జబల్‌పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ ఢిల్లీలోని ఉప్పల్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఈ స్కామ్‌ను విచారిస్తున్న కమిటీలో సభ్యుడు. అంతకుముందు ఈ కుంభకోణాన్ని వెలుగుతీసేందుకు ప్రయత్నించిన విలేకరి ఆకస్మికంగా మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ స్కామ్‌లో నిందితులు, సాక్షులు అయినవారిలో దాదాపు 47 మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
వ్యాపమ్ స్కామ్‌పై రంగంలోకి దిగిన కేంద్రం
వ్యాపమ్ స్కామ్‌లో సాక్ష్యులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్న క్రమంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ అంశమై ఆరా తీసేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఫోన్ చేశారు. వ్యాపమ్ స్కామ్ సాక్ష్యుల మృతిలోని విషయాలు వెలికితీయడానికి వచ్చిన జర్నలిస్టు అనుమానాస్పద మృతిపై రాజ్‌నాథ్ వివరాలు కోరారు. ఈ మేరకు సీఎం, కేంద్ర మంత్రి పలు విషయాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న మరికొంత మంది ఏ క్షణం ఏం జరుగుతుందోనని తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
Advertisement