ఎయిడ్స్ ఫ్రీ బేబీ కంట్రీగా క్యూబా 

ఎయిడ్స్ ఫ్రీ బేబీ కంట్రీగా ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది క్యూబా. అతి చిన్న‌దేశ‌మైన క్యూబా త‌న దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యం ప‌ట్ల ముఖ్యంగా గ‌ర్భ‌స్థ శిశువుల ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ట్ల అవ‌లంబిస్తున్న విధానాలు ప్ర‌పంచానికే ఆద‌ర్శ‌మ‌ని  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యుహెచ్‌వో) ప్ర‌క‌టించింది. త‌ల్లి గ‌ర్భంలోని శిశువుకు త‌ల్లి ద్వారా  హెచ్ఐవీ, సిఫిలిసిస్ వంటి ప్ర‌మాద‌కర లైంగిక వ్యాధులు సంక్ర‌మించ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్న దేశాల్లో క్యూబానే అగ్ర‌దేశ‌మ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. త‌క్కువ […]

Advertisement
Update:2015-07-03 01:31 IST
ఎయిడ్స్ ఫ్రీ బేబీ కంట్రీగా ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది క్యూబా. అతి చిన్న‌దేశ‌మైన క్యూబా త‌న దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యం ప‌ట్ల ముఖ్యంగా గ‌ర్భ‌స్థ శిశువుల ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ట్ల అవ‌లంబిస్తున్న విధానాలు ప్ర‌పంచానికే ఆద‌ర్శ‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యుహెచ్‌వో) ప్ర‌క‌టించింది. త‌ల్లి గ‌ర్భంలోని శిశువుకు త‌ల్లి ద్వారా హెచ్ఐవీ, సిఫిలిసిస్ వంటి ప్ర‌మాద‌కర లైంగిక వ్యాధులు సంక్ర‌మించ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్న దేశాల్లో క్యూబానే అగ్ర‌దేశ‌మ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. త‌క్కువ ఖ‌ర్చుతో రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డం, గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు పెన్సిలిన్ ఇంజెక్ష‌న్లు, ఇత‌ర చికిత్స ప‌ద్ధతుల్ని అమ‌లు చేయ‌డంలో క్యూబా విజ‌యం సాధించింద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడాదికి 14 ల‌క్ష‌ల మంది హెచ్ఐవీ వంటి ప్ర‌మాద‌క‌ర జ‌బ్బులు సోకిన మ‌హిళ‌లు గ‌ర్భం దాలుస్తున్నారు. వారి నుంచి గ‌ర్భ‌స్థ శిశువుల‌కు వ్యాధులు సంక్ర‌మిస్తున్నాయి. ఈ వ్యాధుల నుంచి పుట్ట‌బోయే బిడ్డ‌ల‌ను యాంటీ రిట్రోవైర‌ల్ మెడిసిన్స్ ద్వారా క్యూబా ర‌క్షిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది.
Tags:    
Advertisement

Similar News