జర నవ్వండి ప్లీజ్ 131
ఒక చిన్నపాప మొదటిసారి జూకు వెళ్ళి తన అనుభవం గురించి ఇలా చెప్పింది. “నేను ఏనుగును చూశాను. దానిముందు వేసిన కాయల్ని తన వాక్యూమ్ క్లీనర్‌తో లాగేసుకుంది”. —————————————————————————- “గుర్రం” తల ఉత్తరానికి ఉంటే తోక ఏ వేపుకి ఉంటుంది?” “దక్షిణానికి” కాదు – నేలకు!? —————————————————————————- అర్థరాత్రిపూట ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి “ఈ రాత్రి ఎనిమిది గంటలనించి నా భార్య కనిపించడం లేదు” అన్నాడు. “ఎత్తు, లావు మొదలయిన వివరాలు చెప్పగలరా?” “అవేవీ […]
ఒక చిన్నపాప మొదటిసారి జూకు వెళ్ళి తన అనుభవం గురించి ఇలా చెప్పింది.
“నేను ఏనుగును చూశాను. దానిముందు వేసిన కాయల్ని తన వాక్యూమ్ క్లీనర్‌తో లాగేసుకుంది”.
—————————————————————————-
“గుర్రం” తల ఉత్తరానికి ఉంటే తోక ఏ వేపుకి ఉంటుంది?”
“దక్షిణానికి”
కాదు – నేలకు!?
—————————————————————————-
అర్థరాత్రిపూట ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి “ఈ రాత్రి ఎనిమిది గంటలనించి నా భార్య కనిపించడం లేదు” అన్నాడు.
“ఎత్తు, లావు మొదలయిన వివరాలు చెప్పగలరా?”
“అవేవీ చెప్పలేనండి”
“కనీసం ఆవిడ ఏ రకం చీరకట్టుకుందో చెప్పగలరా?”
“ఆమె తన వెంట తీసుకెళ్ళిన కుక్క గురించి చెప్పగల్ను”
“చెప్పండి”
“అది పెద్దకుక్క చూడ్డానికి భయం కలిగిస్తుంది. నలభై కేజీలు బరువుంటుంది.
శరీరంపై నాలుగు పెద్ద తెల్లమచ్చలుంటాయి. మూడు కాళ్ళు తెల్లగా ఒక కాలు నల్లగా ఉంటుంది. ఒక చెవికి రింగుంటుంది”.
పోలీసతను “వెరీగుడ్! తప్పకుండా కుక్కను పట్టేస్తాం”.
—————————————————————————-
టీచర్ సైన్సులోని గొప్ప గొప్ప విషయాల గుఇరంచి పిల్లలకు వివరిస్తోంది.
యంత్రాలు ఎన్ని అద్భుతాలు చేస్తాయో వివరించండి. పిల్లల్ని చూసి “మీరు కొన్ని ముఖ్యమైన యంత్రాల పేర్లు చెప్పండి” అంది.
పిల్లలు “ఏరోప్లేన్, టెలివిజన్, రోబోట్” వగైరా వగైరా చెప్పారు.
తొమ్మిదేళ్ళ అమ్మాయి లేచి “కోడిపెట్ట” అంది.
టీచర్ ఆ అమ్మాయిని చూసి “నీకు కోడి అద్భుతమయిన యంత్రంలా కనిపిస్తోందా?” అంది.
ఆ అమ్మాయి “మీరే చెప్పండి మేడం. మనం వేసే చెత్తా చెదారం, గడ్డీగాదం తిని కోడి ఒకటి తప్ప గుడ్డు పెట్టేది ఇంకేదయినా ఉందా?” అంది.