భారీ మెజారిటీతో జయలలిత జయకేతనం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు తిరగ రాశారు. ఆర్‌కె నగర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జయకేతనం ఎగుర వేశారు. లక్షా 70 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించి, తన ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఐదు రాష్ర్టాల్లోని ఆరు నియోజకవర్గాలకు జరిగిన ఆసెంబ్లీ ఉప ఎన్నికల ఫిలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. చెన్నైలోని రాధాకృష్ణ నగర్‌ ఉప ఎన్నికలో తమిళనాడు జయలలిత తిరుగులేని మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. మొదటి రౌండ్‌ నుంచే ఆమె స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. […]

Advertisement
Update:2015-06-30 11:30 IST
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు తిరగ రాశారు. ఆర్‌కె నగర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జయకేతనం ఎగుర వేశారు. లక్షా 70 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించి, తన ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఐదు రాష్ర్టాల్లోని ఆరు నియోజకవర్గాలకు జరిగిన ఆసెంబ్లీ ఉప ఎన్నికల ఫిలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. చెన్నైలోని రాధాకృష్ణ నగర్‌ ఉప ఎన్నికలో తమిళనాడు జయలలిత తిరుగులేని మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. మొదటి రౌండ్‌ నుంచే ఆమె స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. చివరకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఒక పక్క కౌంటింగ్‌ జరుగుతుండగానే అన్నాడిఎంకే కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా తేలడంతో జయలలిత సీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆరు నెలలోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో ఆమె పోటీ చేసేందుకు వీలుగా స్థానిక అన్నాడీఎంకే శాసనసభ్యుడు రాజీనామా చేశారు. దాంతో అక్కడ శనివారం ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే ఆమెపై డీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్‌, బీజేపీ సహా ప్రధాన పార్టీలు త‌మ‌ అభ్యర్థులను పోటీలో నిలబెట్టలేదు. దాంతో సీపీఎం అభ్యర్థి మహేంద్రన్‌ ఆమెకు ప్రధాన పోటీగా నిలిచారు. 28 మంది స్వంత్రులు బరిలో నిలిచారు. పోటీకి దిగినవారిలో దాదాపు అందరి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. జ‌య విజ‌యం ప‌ట్ల తమిళనాడు గవర్నర్‌ రోశయ్య హ‌ర్షం ప్ర‌క‌టించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:    
Advertisement

Similar News