శేషాచలంలో ఎర్ర డంపులు!
చెత్త డంపుల గురించి విన్నాం గానీ ఈ ఎర్ర డంపులేమిటా అనుకుంటున్నారా..? ఎర్రచందనం దుంగలను రహస్యంగా దాచి ఉంచిన ప్రదేశాలనే ఇపుడు అధికారులు ఎర్ర డంపులుగా పిలుస్తున్నారు. శేషాచలం అడవుల్లో వందలాది ఎర్రచందనం డంప్‌లు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. శేషాచలం అడవులతో పాటు చిత్తూరు జిల్లా లోని పలు ప్రాంతాల్లో చాలా డంపులు ఉన్నట్లు సమాచారముందని అధికారులు అంటున్నారు. వాటిని వెలికితీసి స్వాధీనం చేసుకోవాలని అటవీశాఖ అధికారులతో కలసి టాస్క్‌ఫోర్స్ అధికారులు భారీ ఎత్తున కసరత్తు […]
Advertisement
చెత్త డంపుల గురించి విన్నాం గానీ ఈ ఎర్ర డంపులేమిటా అనుకుంటున్నారా..? ఎర్రచందనం దుంగలను రహస్యంగా దాచి ఉంచిన ప్రదేశాలనే ఇపుడు అధికారులు ఎర్ర డంపులుగా పిలుస్తున్నారు. శేషాచలం అడవుల్లో వందలాది ఎర్రచందనం డంప్‌లు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. శేషాచలం అడవులతో పాటు చిత్తూరు జిల్లా లోని పలు ప్రాంతాల్లో చాలా డంపులు ఉన్నట్లు సమాచారముందని అధికారులు అంటున్నారు. వాటిని వెలికితీసి స్వాధీనం చేసుకోవాలని అటవీశాఖ అధికారులతో కలసి టాస్క్‌ఫోర్స్ అధికారులు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. శేషాచలం అడవులలో కొట్టి దాచి ఉంచిన ఎర్ర చందనాన్ని తరలించేందుకు స్మగ్లర్లు, కూలీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చంద్రగిరి, రాజంపేట, కడప గుండా అడవుల్లోకి ప్రవేశించి దాచిఉంచిన ఎర్ర చందనాన్ని తమిళనాడు, కర్ణాటకల మీదుగా తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారమందడంతో వారు అప్రమత్తమయ్యారు. అటవీశాఖ, పోలీసు శాఖలోని కొందరు అవినీతిపరులైన అధికారులు, సిబ్బంది స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. దాంతో స్మగ్లర్లు, కూలీల కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. డంప్‌లు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.
Advertisement