జర నవ్వండి ప్లీజ్ 127
ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. మొదటి కుర్రాడు: మా నాన్నకు బంగారు పన్నుంది. మా నాన్న నోరు తెరచుకునే పడుకుంటాడు. రాత్రంతా బెడ్‌ల్యాంప్‌తో పనే లేదు. బంగారు పన్ను బల్బులా వెలుగుతూ ఉంటుంది. రెండో కుర్రాడు: అదేం గొప్ప. మా నాన్న పొద్దుట్నించి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటాడు. పాకెట్లన్నీ డబ్బుతో నిండిపోతాయి. మొదటి కుర్రాడు: మీ నాన్న ఏం చేస్తాడు? రెండో కుర్రాడు: కండక్టర్! —————————————————————————— లలిత శాంతిని “ఆడుకుందాం దా” […]
ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.
మొదటి కుర్రాడు: మా నాన్నకు బంగారు పన్నుంది. మా నాన్న నోరు తెరచుకునే పడుకుంటాడు. రాత్రంతా బెడ్‌ల్యాంప్‌తో పనే లేదు. బంగారు పన్ను బల్బులా వెలుగుతూ ఉంటుంది.
రెండో కుర్రాడు: అదేం గొప్ప. మా నాన్న పొద్దుట్నించి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటాడు. పాకెట్లన్నీ డబ్బుతో నిండిపోతాయి.
మొదటి కుర్రాడు: మీ నాన్న ఏం చేస్తాడు?
రెండో కుర్రాడు: కండక్టర్!
——————————————————————————
లలిత శాంతిని “ఆడుకుందాం దా” అంది
శాంతి కిటికీలోంచి “సారీ! నేను రాలేదు. నేను మా నాన్న దగ్గర కూర్చోకుంటే ఆయన నా హోం వర్కు చేయ్యరు”.
——————————————————————————
ఒక రైతు తన పక్కింటి అతన్తో తన కొడుకు గురించి గొప్పగా చెబుతున్నాడు. అంతలో అతని కొడుకు ఒక కోడిని పట్టుకుని రావడం కనిపించింది. రైతు తన కొడుకుని చూసి “ఎక్కడిదీ కోడి” అన్నాడు.
కొడుకు. “దొంగిలించుకుని వస్తున్నా డాడీ” అన్నాడు.
రైతు పక్కింటి అతన్ని చూసి “నేను చెప్పాను కదా మా వాడి నిజాయితీ గురించి దొంగిలించినా కూడా అబద్ధం చెప్పడు చూడండి” అన్నాడు.
——————————————————————————
కొడుకు: డాడీ! నా షేవింగ్ బ్రష్ ఎందుకింత రఫ్‌గా ఉంది
తండ్రి: నిన్న నా సైకిల్‌కు పెయింట్ వేసినపుడు బాగానే ఉందే!