స్మృతి కేసుతో కోర్టు కొత్త మార్గదర్శనం
లేటయినా లేటెస్టే అయితే సరి అనుకుంది ఢిల్లీ కోర్టు. అందుకే స్మృతి ఇరానీ కేసును ఆలస్యంగా కూడా స్వీకరించి మిగతా కేసులకు మార్గదర్శనం చేసింది. దీంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలిన రాజకీయ నాయకులకూ చుట్టుకోనుందా!? అనే సందేహం కలుగుతోంది. పాత రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వారిపై కూడా కేసులు వేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు న్యాయ నిపుణులు. 2004, 2011 ఎన్నికల అఫిడవిట్లలో […]
Advertisement
లేటయినా లేటెస్టే అయితే సరి అనుకుంది ఢిల్లీ కోర్టు. అందుకే స్మృతి ఇరానీ కేసును ఆలస్యంగా కూడా స్వీకరించి మిగతా కేసులకు మార్గదర్శనం చేసింది. దీంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలిన రాజకీయ నాయకులకూ చుట్టుకోనుందా!? అనే సందేహం కలుగుతోంది. పాత రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వారిపై కూడా కేసులు వేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు న్యాయ నిపుణులు. 2004, 2011 ఎన్నికల అఫిడవిట్లలో స్మృతీ ఇరానీ తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ 2015లో చేసిన ఫిర్యాదును ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆలస్యంగా చేసే ఫిర్యాదులను కోర్టులు సాధారణంగా స్వీకరించవు. ఢిల్లీ కోర్టు దీనికి భిన్నంగా స్పందించింది. న్యాయ ప్రక్రియలు ఉన్నది వినియోగించుకోవడానికే కానీ తోసిపుచ్చడానికి కాదని స్పష్టం చేస్తూ ఈ ఫిర్యాదును స్వీకరించారు. ఈ నేపథ్యంలో మరింత మందిపై కూడా ప్రత్యర్థులు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Advertisement