జర నవ్వండి ప్లీజ్ 126

తండ్రి కొడుకుని తన వ్యాపారంలోకి దించాలనుకున్నాడు. మొదటిరోజు వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ రూఫ్‌ పైకి వెళ్ళారు. తండ్రి: బాబూ! నీకు వ్యాపారానికి సంబంధించిన మొదటిపాఠం ఈరోజు చెప్పబోతున్నాను. రూఫ్‌ అంచులోకి వెళ్ళి నించో. “అంచులోకా డాడీ” అంటూ సందేహిస్తూ కొడుకు వెళ్ళి నిల్చున్నాడు. తండ్రి: “నేను దూకు అని చెబుతూనే కిందకు దూకాలి” అన్నాడు. కొడుకు: ఇరవై అడుగుల ఎత్తునించి దూకితే కాలో చెయ్యో విరగవచ్చు. తండ్రి: మరి వ్యాపార రహస్యం నీకు తెలుసుకోవాలని లేదా? కొడుకు: […]

Advertisement
Update:2015-06-26 18:33 IST

తండ్రి కొడుకుని తన వ్యాపారంలోకి దించాలనుకున్నాడు.
మొదటిరోజు వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ రూఫ్‌ పైకి వెళ్ళారు.
తండ్రి: బాబూ! నీకు వ్యాపారానికి సంబంధించిన మొదటిపాఠం ఈరోజు చెప్పబోతున్నాను. రూఫ్‌ అంచులోకి వెళ్ళి నించో.
“అంచులోకా డాడీ” అంటూ సందేహిస్తూ కొడుకు వెళ్ళి నిల్చున్నాడు.
తండ్రి: “నేను దూకు అని చెబుతూనే కిందకు దూకాలి” అన్నాడు.
కొడుకు: ఇరవై అడుగుల ఎత్తునించి దూకితే కాలో చెయ్యో విరగవచ్చు.
తండ్రి: మరి వ్యాపార రహస్యం నీకు తెలుసుకోవాలని లేదా?
కొడుకు: ఉంది డాడీ!
తండ్రి: “ఐతే దూకు” అన్నాడు. కొడుకు దూకాడు. కాళ్ళూ చేతులూ విరగలేదు కానీ దెబ్బలు తగిలాయి.
తండ్రి రూప్‌ నించి కిందకు దిగి కొడుకును చూసి “ఇప్పుడు నువ్వు వ్యాపారానికి చెందిన మొదటి రహస్యం తెలుసుకున్నావు”
కొడుకు: అదేమిటి డాడీ!
తండ్రి: “ఎవర్నీ నమ్మకు” అని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు. దెబ్బల నొప్పి కూడా మరచిపోయి కొడుకు వ్యాపర రహస్యం తెలిసినందుకు సంతోషించాడు.
—————————————————————–
టీచర్‌: మ్యాథ్స్‌ హోంవర్కులో ఒక్క మనిషి ఇన్నితప్పులు చెయ్యగలడని నేనెప్పుడూ అనుకోలేదు.
స్టూడెంట్‌: నేనొక్కడే కాదు టీచర్‌, దీంట్లో మా నాన్న చెయ్యి కూడా ఉంది.
—————————————————————–
మీ నాన్న చాలా స్ట్రిక్టా?
“అవును”
“నిన్ను బెల్ట్‌తో కొట్టాడా?”
“కొట్టాలని ఒకసారి కష్టపడి బెల్ట్‌తీసి అలసిపోయాడు. ప్యాంట్‌ జారిపోయింది”.

Tags:    
Advertisement

Similar News