జర నవ్వండి ప్లీజ్ 125

రాజేష్‌ని టీచర్‌ ఒక ప్రశ్న వేసింది “రాజేష్‌! అబ్రహాం లింకన్‌ని ఎవరు చంపారు?” రాజేష్‌ సీరియస్‌గా “నేను చంపలేదు టీచర్‌!” అన్నాడు. టీచర్‌కు విపరీతంగా కోపం వచ్చి రాజేష్‌ తండ్రి రాఘవయ్యను పిలిపించింది. రాఘవయ్య వచ్చాడు. ఏమైందని అడిగాడు. “మీ అబ్బాయి అబ్రహాం లింకన్‌ని చంపిందెవరంటే నేను కాదని సమాధానం చెప్పాడండీ” అంది టీచర్‌. రాఘవయ్య సీరియస్‌గా మొఖం పెట్టి “నిజం టీచర్‌! మా అబ్బాయి తను చంపలేదని చెప్పాడంటే దానికి తిరుగుండదు. ఎందుకంటే తను చెయ్యని […]

Advertisement
Update:2015-06-25 18:33 IST

రాజేష్‌ని టీచర్‌ ఒక ప్రశ్న వేసింది
“రాజేష్‌! అబ్రహాం లింకన్‌ని ఎవరు చంపారు?”
రాజేష్‌ సీరియస్‌గా “నేను చంపలేదు టీచర్‌!” అన్నాడు.
టీచర్‌కు విపరీతంగా కోపం వచ్చి రాజేష్‌ తండ్రి రాఘవయ్యను పిలిపించింది. రాఘవయ్య వచ్చాడు. ఏమైందని అడిగాడు.
“మీ అబ్బాయి అబ్రహాం లింకన్‌ని చంపిందెవరంటే నేను కాదని సమాధానం చెప్పాడండీ” అంది టీచర్‌.
రాఘవయ్య సీరియస్‌గా మొఖం పెట్టి “నిజం టీచర్‌! మా అబ్బాయి తను చంపలేదని చెప్పాడంటే దానికి తిరుగుండదు. ఎందుకంటే తను చెయ్యని పని చేశానని వాడెప్పుడూ చెప్పడు” అన్నాడు.
బుర్రతిరిగిపోయిన టీచర్‌ కొడుకును తీసికెళ్ళమన్నది.
తండ్రీకొడుకులు రోడ్లో నడుస్తున్నారు. రాఘవయ్య కొడుకువైపు చూసి “రాజేష్‌! నువ్వు అబ్రహాం లింకన్‌ని చంపలేదు కదా!” అన్నాడు సందేహంగా.
—————————————————————–
చిన్ని కుర్రాడు ఆఫీసులో ఉన్న తండ్రికి ఫోన్‌ చేశాడు. “హలో ఎవరు?” అన్నాడు.
తండ్రి కొడుకు గొంతు గుర్తుపట్టి తమాషా పట్టిద్దామని “ప్రపంచంలో కెల్లా తెలివయిన వాణ్ణి” అన్నాడు.
కొడుకు “క్షమించండి. రాంగ్‌ నెంబర్‌” అని పెట్టేశాడు.
—————————————————————–
తల్లి: రామూ! ఎందుకేడుస్తున్నావ్‌?
రాము: నా వేలికి దెబ్బ తగిలింది.
తల్లి: ఎప్పుడు తగిలింది?
రాము: అరగంటైంది
తల్లి: మరి నువ్వు ఏడవడం నేను వినలేదే
రాము: నువ్వు లేవనుకున్నాను మమ్మీ!
—————————————————————–
సముద్రతీరంలో ఒకపాప “మా అమ్మ కనిపించడం లేదు” అని ఏడుపు మొదలు పెట్టింది. చుట్టుపక్కల చూసే జనం ఆ అమ్మాయిని ఓదార్చి చిప్స్‌ పాకెట్లు, చాక్‌లెట్లు, కూల్‌డ్రింక్‌ తీసిచ్చాడు. అవన్నీ తింటూ తాగుతూ ఏడుపు మానేసింది.
అంతలో ఒకావిడ వచ్చి “మీ మమ్మీ ఎక్కడ ఉందో నాకు తెలుసు” అంది.
ఆ పాప “నాకూ తెలుసు” అంది.

Tags:    
Advertisement

Similar News