పాత నోట్ల మార్పిడికి మ‌రో 6 నెల‌ల గ‌డువు

కరెన్సీ నోట్లలో 2005కు ముందు వాటిని మార్చుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆరు నెలల గడువు పెంచింది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా మార్చాలని తొలుత గడువు విధించారు. దీంతో అంతా బ్యాంకుల వైపు పరుగులు పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ గడువు ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడైనా మీ ద‌గ్గ‌రున్న 2005 సంవ‌త్స‌రానికి ముందున్న నోట్ల‌ను మీ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయండి. లేదా క్యాష్ చేసుకోండి. బ్యాంకుల‌కు మీరు 2005కు […]

Advertisement
Update:2015-06-25 17:11 IST

కరెన్సీ నోట్లలో 2005కు ముందు వాటిని మార్చుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆరు నెలల గడువు పెంచింది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా మార్చాలని తొలుత గడువు విధించారు. దీంతో అంతా బ్యాంకుల వైపు పరుగులు పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ గడువు ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడైనా మీ ద‌గ్గ‌రున్న 2005 సంవ‌త్స‌రానికి ముందున్న నోట్ల‌ను మీ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయండి. లేదా క్యాష్ చేసుకోండి. బ్యాంకుల‌కు మీరు 2005కు పూర్వం నోట్ల‌ను ఇచ్చేస్తే వారు మీకు కొత్త నోట్లు ఇస్తారు. ఆఖ‌రి నిమ‌షం దాకా వేచి ఉండి ఒక‌వేళ మార్చుకోవ‌డం మ‌ర్చిపోతే మీ ద‌గ్గ‌రున్న నోట్ల‌కు పూచిక పుల్ల విలువ కూడా ఉండదు. ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల నోట్ల వరకు ఇది వర్తిస్తుంది.
ఈ నోట్లను గుర్తించడం ఎలాగంటే… నోటుపై గాంధీ బొమ్మకు వెనకవైపు మధ్య భాగంలో కింద ఆ నోటు ఏ సంవత్సరంలో ముద్రించారనే విషయం ఉంటుంది. అది లేకపోతే ఆ నోట్లన్నీ 2005కు ముందు ముద్రించినవ‌ని అర్థం. ఇలాంటి నోట్లలో భద్రతా అంశాలు తక్కువగా ఉండడంతో చాలామంది దాదాపు అవే ఫీచర్లతో దొంగ నోట్లు ప్రింట్‌ చేసి చలామణి చేస్తున్నారు. దీంతో ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించాలని రిజర్వు బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ సంవత్సరం జనవరి నాటికే ఆర్‌బిఐ రూ.21,750 కోట్ల విలువైన ఇలాంటి నోట్లను సేకరించి వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేసింది. 2005కు ముందు త‌యారు చేసిన నోట్లు చెల్లుబాటు కావ‌ని చాలామందికి తెలియ‌క‌పోవ‌డంతో గ‌డువును జూన్ 30 వ‌ర‌కు పొడింగించింది. మ‌ళ్ళీ ఇపుడు ఇదే కార‌ణంతో మ‌రోసారి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈ పొడిగింపును కొన‌సాగిస్తోంది.

Tags:    
Advertisement

Similar News