జర నవ్వండి ప్లీజ్ 122

పెళ్ళిరోజు సందర్భంగా భార్య “ఈ రోజు చికెన్‌ఫ్రై చెయ్యమంటారా?” అంది భర్త “మనం చేసిన తప్పుకు దాన్ని చంపడమెందుకు?” అన్నాడు. ——————— ఒక వ్యక్తి హుక్కా తాగుతున్నాడు. “అంత పొడుగు పైపుతో ఎందుకు తాగుతున్నావు?” అన్నాడు మిత్రుడు. “ఏం లేదు, డాక్టర్‌ పొగాకుకు దూరంగా ఉండమన్నాడు” అన్నాడతను. ————————– వెంకటేశం ఒక హోటల్‌కు వెళ్ళాడు. సర్వర్‌ని గట్టిగా పిలిచాడు. సర్వర్‌ రాలేదు. చాలాసేపటికి వచ్చి “ఏమిటండీ! ఎందుకు తొందర? ఏం కావాలి?” అని గద్దించి మాట్లాడాడు. వెంకటేశంకు […]

Advertisement
Update:2015-06-22 18:33 IST

పెళ్ళిరోజు సందర్భంగా భార్య
“ఈ రోజు చికెన్‌ఫ్రై చెయ్యమంటారా?” అంది
భర్త “మనం చేసిన తప్పుకు దాన్ని చంపడమెందుకు?” అన్నాడు.
———————
ఒక వ్యక్తి హుక్కా తాగుతున్నాడు.
“అంత పొడుగు పైపుతో ఎందుకు తాగుతున్నావు?” అన్నాడు మిత్రుడు.
“ఏం లేదు, డాక్టర్‌ పొగాకుకు దూరంగా ఉండమన్నాడు” అన్నాడతను.
————————–
వెంకటేశం ఒక హోటల్‌కు వెళ్ళాడు. సర్వర్‌ని గట్టిగా పిలిచాడు. సర్వర్‌ రాలేదు. చాలాసేపటికి వచ్చి “ఏమిటండీ! ఎందుకు తొందర? ఏం కావాలి?” అని గద్దించి మాట్లాడాడు. వెంకటేశంకు కోపమొచ్చి హోటల్‌ మేనేజర్‌తో “ఈ వెయిటర్‌ నేను వచ్చి చాలాసేపయినా నా దగ్గరికే రాలేదు, వచ్చిన తరువాత ఎట్లా మొరటుగా ప్రవర్తిస్తున్నాడో చూడండి” అన్నాడు.
మేనేజర్‌ వెయిటర్‌ని కోపంగా చూసి
“ఒరేయ్‌ బుర్రలేనివాడా! ఈ పెద్దమనిషి గంటనించి కుక్క మొరిగినట్లు అరుస్తుంటే నీకు వినిపించడం లేదా? నువ్విట్లా చేస్తే మన హోటల్‌ తిండి తినడానికి వీధి కుక్క కూడా రాదు” అని గదమాయించాడు.
——————————
ఒక స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్కూలుకు వచ్చి ఒక క్లాసు పిల్లల్ని పరీక్షించాలని ఒక ప్రశ్న వేశాడు.
“ప్లాట్‌ఫాం పొడవు 200 మీటర్లయితే ట్రెయిన్‌ స్పీడ్‌ 100 ఐతే నా వయసెంత?” అన్నాడు. ఆ అర్ధం లేని ప్రశ్నకు అందరూ తెల్లమొఖం వేశారు.
కానీ తెలివయిన ఒక కుర్రాడు లేచి “యాభైఏళ్ళు” అన్నాడు.
ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యంగా “అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు?” అన్నాడు.
దానికా కుర్రాడు “ఏంలేదు సార్‌. మా అన్నకు 25 సంవత్సరాలు. ప్రతివాడూ వాణ్ణి “మెంటల్‌” అంటాడు అన్నాడు.

 

Tags:    
Advertisement

Similar News