జాతి, మ‌తాల‌కు అతీతంగా 192 దేశాల్లో యోగా దినోత్స‌వం

అంత‌ర్జాతీయ దినోత్స‌వంగా యోగా జ‌రుపుకోవాల‌న్న భార‌త్ ప్ర‌తిపాద‌న‌ను ఐక్య‌రాజ్య స‌మితి ఆమోదించ‌డంతో ఆదివారం ప్ర‌పంచ వ్యాప్తంగా 192 దేశాల్లో యోగా ఉత్స‌వం జ‌రిగింద‌ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వ‌రాజ్ తెలిపారు. యోగాకు జాతి, మ‌తం లేద‌ని నిరూపింత‌మైంద‌ని ఆమె అన్నారు. భారతదేశంలో ఎన్నోయేళ్ల నుంచే యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్క‌డికి వ‌చ్చారు. […]

Advertisement
Update:2015-06-21 17:12 IST
అంత‌ర్జాతీయ దినోత్స‌వంగా యోగా జ‌రుపుకోవాల‌న్న భార‌త్ ప్ర‌తిపాద‌న‌ను ఐక్య‌రాజ్య స‌మితి ఆమోదించ‌డంతో ఆదివారం ప్ర‌పంచ వ్యాప్తంగా 192 దేశాల్లో యోగా ఉత్స‌వం జ‌రిగింద‌ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వ‌రాజ్ తెలిపారు. యోగాకు జాతి, మ‌తం లేద‌ని నిరూపింత‌మైంద‌ని ఆమె అన్నారు. భారతదేశంలో ఎన్నోయేళ్ల నుంచే యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్క‌డికి వ‌చ్చారు. ఐరాస ప్రధాని కార్యదర్శి బాన్ కీ మూన్‌తో పాటుగా సుష్మాస్వరాజ్ ఈ యోగాలో పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News