జర నవ్వండి ప్లీజ్ 116
రేఖ వాళ్ళ టీచర్ని గురించి స్నేహితురాల్తో ఇలా అంది “మా టీచర్‌కి చాలా దేవుడి పిచ్చి ఉన్నట్లుంది. నేను ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ప్రతిసారీ “ఓ మైగాడ్! ఓ మైగాడ్!” అంటుంది. ———————————————– ప్రకాష్‌ని అటు తిప్పి ఇటు తిప్పి పరీక్షించిన డాక్టర్ భుజం తట్టి “ఏదీ దగ్గవోయ్” అన్నాడు. ప్రకాస్ “నీరసంగా ఉంది. దగ్గలేను డాక్టర్” అన్నాడు. డాక్టర్ “అట్లాకాదు దగ్గవయ్యా” అన్నాడు. ప్రకాష్: “నన్ను బలవంతం చెయ్యకండి. నేను దగ్గితే ఛాతిలో […]
రేఖ వాళ్ళ టీచర్ని గురించి స్నేహితురాల్తో ఇలా అంది
“మా టీచర్‌కి చాలా దేవుడి పిచ్చి ఉన్నట్లుంది. నేను ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ప్రతిసారీ “ఓ మైగాడ్! ఓ మైగాడ్!” అంటుంది.
———————————————–
ప్రకాష్‌ని అటు తిప్పి ఇటు తిప్పి పరీక్షించిన డాక్టర్ భుజం తట్టి “ఏదీ దగ్గవోయ్” అన్నాడు.
ప్రకాస్ “నీరసంగా ఉంది. దగ్గలేను డాక్టర్” అన్నాడు.
డాక్టర్ “అట్లాకాదు దగ్గవయ్యా” అన్నాడు.
ప్రకాష్: “నన్ను బలవంతం చెయ్యకండి. నేను దగ్గితే ఛాతిలో నొప్పి వేస్తుంది” అన్నాడు. కానీ డాక్టర్ ఒప్పుకోలేదు. డాక్టర్ ప్రకాష్ వీపుపైన గుద్దాడు. ప్రకాష్ దగ్గాడు బాధగా.
డాక్టర్ ప్రకాష్‌ని సీరియస్‌గా చూసి “అవునయ్యా! ఈ దగ్గు ఎన్నాళ్ళనించీ ఉంది?” అని అడిగాడు.
———————————————–
డాక్టర్ వెంకట్రావ్ చనిపోయాడు. అతని కొడుకు రఘునాథ్ కూడా డాక్టర్.
రఘునాథ్ కొడుకు వేణుకు నాలుగేళ్ళు.
వేణు “నాన్నా! తాతగారెక్కడికెళ్ళాడు?” అని అడిగాడు.
రఘునాథ్ “దేవుడి దగ్గరికెళ్ళాడు” అన్నాడు.
వేణు: “నాన్నా! దేవుడి ఆరోగ్యం బాగాలేదా?” అన్నాడు.
———————————————–
నారాయణ, అతని భార్య రోజూ కుక్కల్లా పొట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు విపరీతంగా గొడవపడి విసిగిపోయి నారాయణ ఆకాశం కేసి చూసి “భగవంతుడా! నన్ను నీ దగ్గరకు తీసుకో” అన్నాడు.
అతని భార్య కూడా ఆకాశంలోకి చూసి “దేవా! నన్ను నీ దగ్గరికి తీసుకో” అంది. ఆమె ఆ మాటన్న వెంటనే నారాయణ “ప్రభూ! ఆమె కోరికను మొదట మన్నించు” అన్నాడు.