జర నవ్వండి ప్లీజ్ 113
బంటాసింగ్ ఆ ఫ్లాట్స్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటాడు. బంటాసింగ్‌కు పన్నెండుమంది సంతానం. కుటుంబ నియంత్రణ ఉద్యోగి బంటాసింగ్ ఇంటికి వచ్చి “అబ్బో! ఇంతమంది పిల్లలా!” అన్నాడు. బంటా సింగ్ “అంతా పైవాడి దయ” అన్నాడు. కుటుంబ నియంత్రణ ఉద్యోగి ఆ వివరాలు తెలుసుకోడానికి పై ఫ్లాటుకు వెళ్ళాడు. —————————————– కూతురికి పదిహేడు, పద్దెనిమిదేళ్ళు వస్తున్నా యింకా సంబంధాలు చూడడం లేదని భార్య భర్తని అరిచింది. భర్త “లేదు, చూస్తున్నాను. చాలామంది కుర్రాళ్ళని చూస్తున్నాను. ఎవణ్ణి చూసినా ప్రతి ఒక్కడూ […]
బంటాసింగ్ ఆ ఫ్లాట్స్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటాడు. బంటాసింగ్‌కు పన్నెండుమంది సంతానం. కుటుంబ నియంత్రణ ఉద్యోగి బంటాసింగ్ ఇంటికి వచ్చి “అబ్బో! ఇంతమంది పిల్లలా!” అన్నాడు.
బంటా సింగ్ “అంతా పైవాడి దయ” అన్నాడు.
కుటుంబ నియంత్రణ ఉద్యోగి ఆ వివరాలు తెలుసుకోడానికి పై ఫ్లాటుకు వెళ్ళాడు.
—————————————–
కూతురికి పదిహేడు, పద్దెనిమిదేళ్ళు వస్తున్నా యింకా సంబంధాలు చూడడం లేదని భార్య భర్తని అరిచింది.
భర్త “లేదు, చూస్తున్నాను. చాలామంది కుర్రాళ్ళని చూస్తున్నాను. ఎవణ్ణి చూసినా ప్రతి ఒక్కడూ తెలివితక్కువ వాడిగానే కనిపిస్తున్నాడు” అన్నాడు.
భార్య “మా నాన్న కూడా మీలాగా ఆలోచించివుంటే నేను జీవితాంతం పెళ్ళి లేకుండా ఉండిపోయేదాన్ని” అంది.
———————————————–
మొదటి రోజు స్కూలుకు వచ్చిన కుర్రాడు క్లాస్‌టీచర్‌కు ఒక ఉత్తరం ఇచ్చాడు. అందులో “ఈ అబ్బాయి వ్యక్తపరిచే అభిప్రాయాలు కేవలం ఈ అబ్బాయివి మాత్రమే. దాంతో తల్లిదండ్రులకు ఏమాత్రం సంబంధం లేదని ఇందుమూలంగా తెలుపుతున్నాం” అని వుంది.
టీచర్ ఆ అబ్బాయిని “ఈ ఉత్తరం ఎవరిచ్చారు?” అని అడిగింది.
ఆ అబ్బాయి “మా మమ్మీ” అన్నాడు. “మీ మమ్మీ ఏం చేస్తుంది?” అని అడిగింది టీచర్.
“నవలలు రాస్తుంది” అన్నాడా అబ్బాయి.