ఇక టెట్రాప్యాక్‌లలో లిక్కర్
చిన్నచిన్న కూల్‌డ్రింక్ షాపుల్లో రకరకాల జ్యూసులు, పాలు టెట్రాప్యాక్‌లలో లభించినట్లే ఇక నుంచి లిక్కర్ కూడా టెట్రాప్యాక్‌లలో లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన ఇది. 90 ఎం.ఎల్, 180 ఎం.ఎల్ సైజుల్లో టెట్రాప్యాక్‌లలో లిక్కర్ అందించనున్నారు. బాగ్‌పైపర్, ఓల్డ్‌మాంక్, హేవార్డ్స్ వంటి లోకల్ బ్రాండ్స్ లిక్కర్ ను ఇలా చిన్నచిన్న ప్యాక్‌లలో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసేశారని సమాచారం. 30, 40 రూపాయలకే లిక్కర్ […]
Advertisement
చిన్నచిన్న కూల్‌డ్రింక్ షాపుల్లో రకరకాల జ్యూసులు, పాలు టెట్రాప్యాక్‌లలో లభించినట్లే ఇక నుంచి లిక్కర్ కూడా టెట్రాప్యాక్‌లలో లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన ఇది. 90 ఎం.ఎల్, 180 ఎం.ఎల్ సైజుల్లో టెట్రాప్యాక్‌లలో లిక్కర్ అందించనున్నారు. బాగ్‌పైపర్, ఓల్డ్‌మాంక్, హేవార్డ్స్ వంటి లోకల్ బ్రాండ్స్ లిక్కర్ ను ఇలా చిన్నచిన్న ప్యాక్‌లలో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసేశారని సమాచారం. 30, 40 రూపాయలకే లిక్కర్ అందుబాటులోకి తీసుకురావాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు పోటీగా చంద్రబాబు ఈ ఆలోచన చేశారట. టెట్రా ప్యాక్‌లలో మందు అందుబాటులోకి తీసుకురాకపోతే తెలంగాణతో సరిహద్దుగా ఉన్న ఆరు ఆంధ్రా జిల్లాలలో కూడా లిక్కర్ అమ్మకాలు ప్రమాదంలో పడతాయని ఎక్సయిజ్ అధికారులు హెచ్చరించడంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనను ఆమోదించారట. క్వార్టర్, హాఫ్ బాటిల్స్ కొనలేని నిరుపేదలు ఈ టెట్రాప్యాక్‌లను కొనుక్కోగలుగుతారని, దానివల్ల అమ్మకాలు బాగా పెరుగుతాయని అధికారులంటున్నారు.
Advertisement