ఆప్ సర్కారుకు మళ్లీ జంగ్ ఝలక్
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య మళ్లీ కొత్త వివాదానికి తెరలేచింది. ఢిల్లీ ఏసీబీ చీఫ్‌గా జాయింట్ కమిషనర్ ఎంకే మీనాను జంగ్ నియమించడంతో ఆప్ ప్రభుత్వం మండిపడుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన వ్యక్తిని కాదని, జంగ్ తీసుకున్న నిర్ణయం ఆప్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఢిల్లీ జాయింట్ కమిషనర్‌గా మీనా ఉన్న సమయంలో రైతు గజేంద్ర సింగ్ మరణాన్ని హత్య కేసుగా […]
Advertisement
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య మళ్లీ కొత్త వివాదానికి తెరలేచింది. ఢిల్లీ ఏసీబీ చీఫ్‌గా జాయింట్ కమిషనర్ ఎంకే మీనాను జంగ్ నియమించడంతో ఆప్ ప్రభుత్వం మండిపడుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన వ్యక్తిని కాదని, జంగ్ తీసుకున్న నిర్ణయం ఆప్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఢిల్లీ జాయింట్ కమిషనర్‌గా మీనా ఉన్న సమయంలో రైతు గజేంద్ర సింగ్ మరణాన్ని హత్య కేసుగా తనపై బనాయించాలని చూసిన అధికారి ఇతడేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా తెలిపారు. ఏసీబీలోకి బీహార్ పోలీసులను ఆప్ నియమించిన నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
Advertisement