బీసీజీ ఇంజక్షన్‌తో మధుమేహానికి చికిత్స!
టీబీ రాకుండా వేసే వ్యాక్సిన్, బ్లడ్ కేన్సర్ చికిత్సలో ఉపయోగపడే బాసిలస్ కాల్మెట్ గువెరిన్ ఔషధం ఇప్పుడు డయాబెటిస్‌ను కూడా నయం చేస్తోందని వైద్యులు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. బాసిలస్ కాల్మెట్ గువెరిన్ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ, బీసీజీ అంటే ఠక్కున గుర్తొస్తుంది. ఈ బీసీజీ వ్యాక్సిన్‌లో ఇప్పుడు మసాచుసెట్స్ జనరల్ హాస్పటల్ వైద్యులు ఒక కొత్త గుణాన్ని కొనుగొన్నారు. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేసే డయాబెటిస్‌ను నయం చేసే లక్షణాన్ని బయటపెట్టారు. ఇప్పటికే […]
Advertisement
టీబీ రాకుండా వేసే వ్యాక్సిన్, బ్లడ్ కేన్సర్ చికిత్సలో ఉపయోగపడే బాసిలస్ కాల్మెట్ గువెరిన్ ఔషధం ఇప్పుడు డయాబెటిస్‌ను కూడా నయం చేస్తోందని వైద్యులు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. బాసిలస్ కాల్మెట్ గువెరిన్ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ, బీసీజీ అంటే ఠక్కున గుర్తొస్తుంది. ఈ బీసీజీ వ్యాక్సిన్‌లో ఇప్పుడు మసాచుసెట్స్ జనరల్ హాస్పటల్ వైద్యులు ఒక కొత్త గుణాన్ని కొనుగొన్నారు. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేసే డయాబెటిస్‌ను నయం చేసే లక్షణాన్ని బయటపెట్టారు. ఇప్పటికే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ ఇప్పుడు రెండో దశ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉంది. మొదటి దశలో కొద్ది మొత్తాల్లో ఈ ఇంజక్షన్లు ఇవ్వగా.. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగినట్లు గుర్తించారు. దీంతో రెండో దశ ట్రయల్స్ కూడా సఫలమవుతాయనే అంటున్నారు.
Advertisement