జర నవ్వండి ప్లీజ్ 107

ఒక కోటీశ్వరుడు కొడుకుతో “నీ వయసులో మూటలు మోశాను. కప్పులు కడిగాను. రోజుకు 18 గంటలు పనిచేశాను” అని వుపన్యసించాడు. కొడుకు “నీ కష్టానికి గర్వపడుతున్నాను డాడీ! అవన్నీ ముందుగా చేసి మంచి పనిచేశావు. లేకుంటే ఆ గొడ్డు చాకిరీ అంతా నేను చెయ్యాల్సివచ్చేది!” అన్నాడు. ————————————— ఓసారి విమానం ఏథెన్స్‌ నగరాన్ని సమీపిస్తోంది. ఎయిర్‌హోస్టెస్‌ “విమానం” ఏథెన్స్‌ నగరం అవుట్‌స్కర్ట్స్‌ చేరుతోంది” అని ఆరు సార్లు అనౌన్స్‌ చేసింది. విసిగిపోయిన పాసింజర్‌ “ఈ విమానం అవుట్‌స్కర్ట్స్‌ […]

Advertisement
Update:2015-06-07 18:33 IST

ఒక కోటీశ్వరుడు కొడుకుతో “నీ వయసులో మూటలు మోశాను. కప్పులు కడిగాను. రోజుకు 18 గంటలు పనిచేశాను” అని వుపన్యసించాడు.
కొడుకు “నీ కష్టానికి గర్వపడుతున్నాను డాడీ! అవన్నీ ముందుగా చేసి మంచి పనిచేశావు. లేకుంటే ఆ గొడ్డు చాకిరీ అంతా నేను చెయ్యాల్సివచ్చేది!” అన్నాడు.
—————————————
ఓసారి విమానం ఏథెన్స్‌ నగరాన్ని సమీపిస్తోంది.
ఎయిర్‌హోస్టెస్‌ “విమానం” ఏథెన్స్‌ నగరం అవుట్‌స్కర్ట్స్‌ చేరుతోంది” అని ఆరు సార్లు అనౌన్స్‌ చేసింది.
విసిగిపోయిన పాసింజర్‌
“ఈ విమానం అవుట్‌స్కర్ట్స్‌ వదిలేసి స్కర్ట్స్‌కి ఎప్పుడు చేరుతుంది” అన్నాడు.
—————————————
పేపర్‌లో క్రింది ప్రకటన వచ్చింది
“మీకు చదువు రాదా? మీకు చదవడానికి రాయడానికీ రాదా?
రాకుంటే మాకు వెంటనే ఉత్తరం రాయండి. మీకు సహాయపడతాం”
—————————————
భార్యా భర్తా పోట్లాడుకున్నారు. భార్య కోపంతో సూట్‌కేసులో బట్టలు సర్దుకుంది. ఇల్లుదాటి వెళుతూ ఉంటే భర్త “ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాడు.
భార్య మరింత రోషంతో “ఎక్కడికి పోతే మీకెందుకు? నరకానికి వెళుతున్నా” అంది.
“సరే నరకానికి వెళితే మాత్రం మీ అమ్మానాన్నలకు, ఇతర బంధువులకు నా నమస్కారాలు చెప్పు” అన్నాడు భర్త.

Tags:    
Advertisement

Similar News