జర నవ్వండి ప్లీజ్ 101
“సార్! మీ దగ్గర పదేళ్ళ నించీ పనిచేస్తున్నా. నా జీతం పెంచమని మా ఆవిడ అడగమంది సార్!” అన్నాడతను బాస్‌తో. బాస్ “ఒక్క నిమిషం” అని తన భార్యకు ఫోన్ చేసి “ప్చ్! మా ఆవిడ పెంచనంటోందోయ్” అన్నాడు. —————————————— ఆ మతిమరుపు అణుశాస్త్రవేత్త తన పరిశోధనలో లీనమై భోజనానికి రెండ్రోజుల నించి ఇంటికి వెళ్ళలేదు. భర్త ఆరోగ్యం గురించి ఆదుర్దా పడిన భార్య ఫోన్ చేసి “రాత్రికి ఇంటికి భోజనానికి రండి” అంది. “తప్పకుండా మేడం! […]
“సార్! మీ దగ్గర పదేళ్ళ నించీ పనిచేస్తున్నా. నా జీతం పెంచమని మా ఆవిడ అడగమంది సార్!” అన్నాడతను బాస్‌తో. బాస్ “ఒక్క నిమిషం” అని తన భార్యకు ఫోన్ చేసి “ప్చ్! మా ఆవిడ పెంచనంటోందోయ్” అన్నాడు.
——————————————
ఆ మతిమరుపు అణుశాస్త్రవేత్త తన పరిశోధనలో లీనమై భోజనానికి రెండ్రోజుల నించి ఇంటికి వెళ్ళలేదు. భర్త ఆరోగ్యం గురించి ఆదుర్దా పడిన భార్య ఫోన్ చేసి “రాత్రికి ఇంటికి భోజనానికి రండి” అంది. “తప్పకుండా మేడం! కాస్త మీ అడ్రస్ చెబుతారా?” అన్నాడు శాస్త్రవేత్త.
——————————————
కొత్తగా పెళ్ళయిన సంగీత ముందు ఆ సేల్స్‌మేన్ ఆటోమేటిక్ వాషింగ్‌మిషన్ గురించి చెబుతూ “ఇదేం పెద్ద కష్టం కాదండీ. చాలా సులభం. చిన్న పిల్లవాడు కూడా దీన్ని హాండిల్ చెయ్యొచ్చు” అన్నాడు.
సంగీత చిరునవ్వు నవ్వుతూ “ఐతే మా ఆయన్ని పిలుస్తానుండు” అంది.
——————————–
ఒకతను బాగా అలసిపోయి ట్రెయిన్‌లో నిద్రపోయాడు. మెలకువ వచ్చి చూసేసరికి సూర్యుడు పడమటికొండల మీద ఉన్నాడు. అది సూర్యోదయమో, సూర్యాస్తమయమో అర్ధం కాలేదు. ట్రెయిన్ ఆగింది. అతను కిందకు దిగి “ఇది ఉదయమా? సాయంత్రమా?” అని అడిగాడు ఒకతన్ని. అతను ఎగాదిగా చూసి “మాది ఈ ఊరు కాదు. ఈ ఊళ్ళో వాళ్ళనడగండి” అన్నాడు.