దేవుని దయ (Devotional)

 ఒక రబ్బీ పవిత్ర జీవితం గడిపేవాడు. కష్టాలలో ఉన్న వాళ్ళకి మాటసాయం మాత్రమే కాదు, వీలయినంత ఆర్థిక సాయం చేసేవాడు. ఆయన రబ్బీ మాత్రమే కాదు, వ్యాపారస్థుడు కూడా. వ్యాపార నిమిత్తం ఆయన పక్క ఊళ్ళకు కూడా వెళ్లేవాడు. ప్రక్క ఊళ్ళలో వీలయితే సినగాగ్‌ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు.             ఆయన సుప్రసిద్ధుడు గనక ప్రార్థనల కోసం దూరప్రాంతాల జనాలు కూడా ఆయన్ని తమ ఊళ్ళకు ఆహ్వానించేవాళ్ళు. తనకు సమయముంటే, అక్కడికి తప్పని సరిగా వెళ్ళాల్సి ఉంటే […]

Advertisement
Update:2015-05-28 18:31 IST

ఒక రబ్బీ పవిత్ర జీవితం గడిపేవాడు. కష్టాలలో ఉన్న వాళ్ళకి మాటసాయం మాత్రమే కాదు, వీలయినంత ఆర్థిక సాయం చేసేవాడు. ఆయన రబ్బీ మాత్రమే కాదు, వ్యాపారస్థుడు కూడా. వ్యాపార నిమిత్తం ఆయన పక్క ఊళ్ళకు కూడా వెళ్లేవాడు. ప్రక్క ఊళ్ళలో వీలయితే సినగాగ్‌ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు.

ఆయన సుప్రసిద్ధుడు గనక ప్రార్థనల కోసం దూరప్రాంతాల జనాలు కూడా ఆయన్ని తమ ఊళ్ళకు ఆహ్వానించేవాళ్ళు. తనకు సమయముంటే, అక్కడికి తప్పని సరిగా వెళ్ళాల్సి ఉంటే ఆయన వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళేవాడు.

వ్యాపారం, ఆధ్యాత్మికత రెండూ ఘర్షణ పడకుండా దేనికదిగా వేరుచేసి ఆయన నిర్వహించేవాడు.

ఆయన ఊళ్ళో అయితే ఆయన ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ప్రతిరోజూ సినగాగ్‌ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు. ఆయన ప్రవచనాలు వినడానికి జనం పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు.

అంతేకాక కొందరు గృహస్థులు ఆయన్ని తమ ఇంటికి ఆహ్వానించి తాల్మడ్‌, తోరా వంటి పవిత్ర గ్రంథాల ప్రవచనాలు ఆయనతో చెప్పించుకునే వాళ్ళు.

ప్రత్యేకించి పండుగదినాల్లో ఆయన పవిత్రంగా ప్రవచిస్తూఉంటే అందరూ ఆరాధనతో వినేవాళ్ళు.

ఆ రోజు ఒక యూదు పండుగదినం. అందరూ శుభ్రంగా తయారయి సినగాగ్‌ చేరుకున్నారు. రబ్బీ స్టేజి ఎక్కాడు. తొల్మడ్‌లోని కొన్ని అధ్యాయాల్ని చదివి ఆయన వాటికి గొప్ప వ్యాఖ్యానం చేశాడు. ఆరోజు ఆనందంగా గడిచింది.

రబ్బీ ఉదయాన్నే లేచి దేవునికి కృతజ్ఞతా పూర్వకమయిన ప్రార్థనచేసి వ్యాపార నిమిత్తం పక్క ఊరికి ప్రయాణమై వెళ్ళాడు.

రబ్బీ వెళ్ళిన గంటసేపటికి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి ఆయన ఇల్లు కాలి బూడిద అయింది. ఇంట్లో ఉన్న సామాన్లు, గ్రంథాలు, అన్నీ దగ్గమయ్యాయి. జనాలు ఎంత ప్రయత్నించినా మంటల్ని అదుపు చేయలేకపోయారు.

ఆ రోజు సాయంత్రానికి రబ్బీ తిరిగి వచ్చాడు. జనం రబ్బీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన ఘోరం వివరించాడు. ఆయన ఇల్లు కాలి బూడిదయిపోయిన విషయం చెప్పారు.

రబ్బీ ఆ మాటలు విని ఏమాత్రం ఆందోళన పడలేదు. ఎప్పట్లా మామూలుగా చిరునవ్వు నవ్వుతూ “అలాగా” అన్నారు. జనం విస్తుపోయారు. రబ్బీ సాయంత్ర ప్రార్థన కోసం సినగాగ్‌ బయల్దేరాడు. జనం ఆయన్ని అనుసరించారు.

రబ్బీ పవిత్ర గ్రంథం చదివి ఎప్పట్లాగే దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. “దేవుడా! నాకు నువ్వీ జన్మనిచ్చినందుకు, నాపట్ల శ్రద్ధ చూపించి నన్ను చల్లగా చూసినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను” అన్నాడు.

జనం ఎప్పటిలా రొటీన్‌గా దేవుని ప్రార్థనలో భాగంగా ఆ మాటలు చెప్పాడని భావించాడు.

రబ్బీ “నేను ఎప్పట్లా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నా. నాకు ఐశ్వర్యం వచ్చినా, దరిద్రం వచ్చినా, నేను ఆనందంగా ఉన్నా, విషాదంగా ఉన్నా వాటిని కలిగించేది దేవుడే. మానవునికి ఆయన చేతుల్లో ఉన్నపుడు ఆయన మనకు ఏమి కల్పించినా దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు నా ఇల్లు కాలిపోయింది. కానీ నేను ఇంట్లో లేకుండా ఉండేట్లు ఆయన ఉద్దేశించాడు. అందుకని దేవునికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను” అన్నాడు.

ఆయనకు దేవునిపట్ల ఉన్న అపార విశ్వాసానికి అందరూ తలవంచారు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News