జర నవ్వండి ప్లీజ్ 96
తెరమీద హీరో హీరోయిన్‌ని తెగ ప్రేమించేస్తున్నాడు. సినిమా చూస్తున్న ఆమె భర్త దగ్గరికి జరిగి “మీరెప్పుడైనా అంత సీరియస్‌గా నన్ను ప్రేమించారా?” అని అడిగింది. భర్త ఆమె వైపు చూసి “అంత సీరియస్‌గా ప్రేమిస్తున్నందుకు నిర్మాత హీరోకి యాభైలక్షలిస్తున్నాడు తెలుసా?” అన్నాడు. ——————————– అతను న్యూస్‌పేపర్ ఆఫీసుకు వచ్చి తన భార్య పర్సు ఎక్కడో పోయిందని అది తెచ్చిచ్చిన వాళ్ళకు వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు. పత్రిక ఎడిటర్ “పర్సుకోసం ఇది చాలా ఎక్కువ బహుమానం” […]
తెరమీద హీరో హీరోయిన్‌ని తెగ ప్రేమించేస్తున్నాడు. సినిమా చూస్తున్న ఆమె భర్త దగ్గరికి జరిగి “మీరెప్పుడైనా అంత సీరియస్‌గా నన్ను ప్రేమించారా?” అని అడిగింది.
భర్త ఆమె వైపు చూసి “అంత సీరియస్‌గా ప్రేమిస్తున్నందుకు నిర్మాత హీరోకి యాభైలక్షలిస్తున్నాడు తెలుసా?” అన్నాడు.
——————————–
అతను న్యూస్‌పేపర్ ఆఫీసుకు వచ్చి తన భార్య పర్సు ఎక్కడో పోయిందని అది తెచ్చిచ్చిన వాళ్ళకు వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు.
పత్రిక ఎడిటర్ “పర్సుకోసం ఇది చాలా ఎక్కువ బహుమానం” అన్నాడు.
“ఫర్వాలేదు, పర్సు నా దగ్గరే ఉంది” అన్నాడతను తాపీగా.
——————————–
ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన భార్యకోసం అతను ప్రకటన ఇచ్చాడు.
“రాధా! ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు దయచేసి తిరిగి రావద్దు”
——————————–
ఆమె వార్తలు చదివే ఉద్యోగం చేస్తుంది. రాత్రి పడుకోబోయేముందు దేవుణ్ణి ప్రార్థించి చివర్లో “భగవాన్! వార్తలు ముగించేముందు ముఖ్యాంశాలు ఒకసారి” అంది.