చిరు vs. పూరి, చెరోదారి!

ఇద్దరూ కలిసి ఒకే ప్రయాణం చేయడానికి సంసిద్ధులైన మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు చెరో దారి వెతుక్కున్నారు. అదేమిటి? చిరు 150 వ మూవీ డైరెక్ట్ చేసే సువర్ణ అవకాశం వచ్చింది కదా పూరీకి! మీ డవుట్ కరక్టే సుమా! చిరు చలో యూ.కె… పూరీ చలో బ్యాంకాక్. ఇద్దరూ చెరో దారి వెళ్ళిపోయారు ప్రస్తుతానికి. పూరి బ్యాంకాక్ ప్రయాణం మనందరికి తెలిసిoదే. తన సినిమాలకు స్క్రిప్ట్‌లు రాసుకోవడానికి పూరీకి బ్యాంకాక్ ఫేవరేట్ […]

Advertisement
Update:2015-05-26 07:12 IST

ఇద్దరూ కలిసి ఒకే ప్రయాణం చేయడానికి సంసిద్ధులైన మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు చెరో దారి వెతుక్కున్నారు. అదేమిటి? చిరు 150 వ మూవీ డైరెక్ట్ చేసే సువర్ణ అవకాశం వచ్చింది కదా పూరీకి! మీ డవుట్ కరక్టే సుమా! చిరు చలో యూ.కె… పూరీ చలో బ్యాంకాక్. ఇద్దరూ చెరో దారి వెళ్ళిపోయారు ప్రస్తుతానికి.

పూరి బ్యాంకాక్ ప్రయాణం మనందరికి తెలిసిoదే. తన సినిమాలకు స్క్రిప్ట్‌లు రాసుకోవడానికి పూరీకి బ్యాంకాక్ ఫేవరేట్ ప్లేస్ కదా! అందుకే చిరంజీవి 150వ సినిమా స్క్రిప్ట్ డైలాగ్స్ పని ప్రశాంతంగా అక్కడ చేసుకుంటున్నాడు. ఆగస్ట్ 22, చిరంజీవి పుట్టినరోజు నాటికి స్క్రిప్ట్ రెడీ అయిపోవాలి మరి.

చిరంజీవి పుత్రికోత్సాహం కారణంగా యూ.కె. లో ఉన్నాడు. తన చిన్న కుమార్తె శ్రీజ అక్కడ ఎం.బి.యె. పూర్తి చేసినందున, ఆమె కాన్‌వొకేషన్ సంబరం కోసం భార్యతో సహా యూ.కే. లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. అదీ సంగతి. మొత్తానికి పూరీ, మహేష్ గొడవ మరచిపోయి, నితిన్ సినిమాని తలపులనుండి తీసేసి, టోటల్‌గా చిరు సినిమాపైన కాన్‌సంట్రేట్ చేయడం మెగా అభిమానులకు హ్యాపీ న్యూసే కదా!
Tags:    
Advertisement

Similar News