నిగ్రహం (Devotional)

ఎన్ని సాధించినా నిగ్రహం లేకపోతే అన్ని శక్తులూ నిర్వీర్యమయిపోతాయి. మానవ శక్తికి పరిమితులున్నాయి. దైవ శక్తికి అవథులు లేవు. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. దైవం మన అహంకారాన్ని వదులుకోవడానికి సహకరిస్తుంది. అంతే కాని మన అహంకారాన్ని, స్వార్ధాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి అనుమతించదు. ఒక యోగి అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. దైవానుగ్రహం వల్ల ఎన్నో శక్తుల్ని సంపాదించాడు. అరణ్యాన్ని వదిలి తన ఊరు చేరడానికి బయల్దేరాడు. దారిలో ఒక నది […]

Advertisement
Update:2015-05-24 18:31 IST

ఎన్ని సాధించినా నిగ్రహం లేకపోతే అన్ని శక్తులూ నిర్వీర్యమయిపోతాయి. మానవ శక్తికి పరిమితులున్నాయి. దైవ శక్తికి అవథులు లేవు. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. దైవం మన అహంకారాన్ని వదులుకోవడానికి సహకరిస్తుంది. అంతే కాని మన అహంకారాన్ని, స్వార్ధాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి అనుమతించదు.

ఒక యోగి అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. దైవానుగ్రహం వల్ల ఎన్నో శక్తుల్ని సంపాదించాడు. అరణ్యాన్ని వదిలి తన ఊరు చేరడానికి బయల్దేరాడు. దారిలో ఒక నది కనిపించింది. అటూ యిటూ చూశాడు. దూరంగా ఒక పెద్ద చెట్టు కింద ఒక తండ్రీ కూతురు భోజనం చేయబోతూ కనిపించారు. నదికి దగ్గరగా నిలిపి ఉంచిన చిన్ని పడవ వాళ్ళదే అని యోగి గుర్తించాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ‘పడవలో నన్ను అవతలి వేపుకి దాటిస్తారా ? ‘ అని అడిగాడు. తండ్రి ‘తప్పకుండా స్వామీ ! అదెంత భాగ్యం. ఆకలిగా ఉంది. ఐదు నిముషాల్లో అన్నం తిని తప్పక మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాం ‘ అన్నాడు.

యోగి ‘ నేను అంత సేపు ఆగలేను. వెంటనే వెళ్ళాలి ‘ అన్నాడు అధికార స్వరం తో. ‘ఎంత సేపు స్వామీ ! కాసేపట్లో తినేస్తాను ‘ అన్నాడు పడవ నడిపే అతను. యోగి కి ఆగ్రహం కలిగింది ‘వెంటనే నన్ను నది దాటించకుంటే శపిస్తాను ‘ అన్నాడు. పరిస్థితి గమనించి పడవ నడిపే అతని కూతురు ‘నాన్నా ! నువ్వు తిను . నేను స్వామిని నదిని దాటించి వస్తాను’ అంది. యిద్దరూ పడవలో వెళుతున్నారు. ఎన్నో ఏళ్ళు అరణ్యంలో వుండటం వల్ల స్త్రీ ని చూడని యోగికి ఆ అమ్మాయిని చూసే సరికి కాంక్ష కలిగింది. ఆమెతో చెప్పాడు ! “నా నోరు దుర్గంధం వేస్తుంది. మేము హీన కులస్తులం” అంది. ‘నా శక్తితో మారుస్తానన్నాడు. వెంటనే ఆ అమ్మాయి నోటి నుండి మనోహరమయిన పరిమళం వ్యాపించింది.

ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి “స్వామీ! ఆకాశంలో ధగధగలాడే సూర్యుడు మనల్ని చూస్తున్నాడు” అంది సిగ్గు పడుతూ.

యోగి ‘నా తపఃశక్తితో ఏమయినా చెయ్యగలను”. అని నది నీటిని తీసి ఆకాశంలోకి విసిరాడు. ఆకాశమంతా మంచుపొగ కమ్మి సూర్యుడు అదృశ్యమయ్యాడు. అమ్మాయికేసి గర్వంగా చూసి ఆమెను దగ్గరికి తీసుకోపోయాడు. “స్వామీ! నదిలో నీళ్ళు మననే చూస్తున్నాయి” అంది. అప్పటికే దాదాపు పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయే వ్యామోహం లో వున్నాడు యోగి. కళ్ళెర్ర చేసి నీటికేసి చూసి “ఇసుకగా మారిపో!” అన్నాడు. నది మాయమై యిసుక మిలిగింది. పడవ కదల్లేదు.

ఆ అమ్మాయి తెలివైంది. సంస్కారవంతురాలు. అప్పటినుంచీ యోగి పరిస్థితిని గమనిస్తూనే వుంది.

‘స్వామి! మీరు శక్తి సంపన్నులు. మీరు నిగ్రహం లేకపోవడం వల్ల మీ తపో శక్తిని వృధా చేస్తున్నారు. మీ లక్ష్యం నది దాటడం. అందుకనే యిక్కడికి వచ్చారు. కాని వ్యామోహంతో అది మరచిపోయారు. కాంక్షతో కళ్ళకు గంతలు కట్టుకున్నారు. చివరకి అన్నీ మీ స్వార్ధం కోసం, స్వలాభం కోసం ప్రకృతి గమనాన్నే మార్చాలనుకున్నారు. కానీ అది తాత్కాలికం. ప్రకృతి మళ్ళీ యధా స్థితికి వస్తుంది. దైవశక్తి తల వంచనిది. ఆగ్రహాన్ని వదిలేయండి. మీకు దైవమిచ్చిన శక్తుల్ని మంచి పనులకు ఉపయోగిస్తే అవి శాశ్వతంగా వుంటాయి. లేకుంటే అవి త్వరగా మిమ్మల్ని వదిలి పెట్టి పోతాయి ‘ అని హెచ్చరించింది.

యోగి తన అనుచిత చర్యని గ్రహించి పశ్చాత్తాప పడ్డాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News