మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాదకర స్థాయిలో సీసం!
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇన్‌స్టెంట్ మ్యాగీ నూడుల్స్‌లో అధిక శాతం సీసం ఉన్నట్టు, ఇది చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు యూపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ సరుకును వాపసు తీసుకోవలసిందిగా ఉత్తరప్రదేశ్‌లోని ఆహార భద్రతా, ఔషధ నియంత్రణ విభాగం(ఎఫ్‌డీఏ) అధికారులు ఆ బ్రాండ్‌ను తయారు చేసే నెస్లే ఇండియాను ఆదేశించారు. కొన్ని షాపులలోని మ్యాగీ నూడుల్స్ రెండు డజన్ల ప్యాకెట్లను ఒక ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించి చూడగా వాటిలో సీసపు పదార్థం అనుమతించదగిన స్థాయికన్నా దాదాపు […]
Advertisement
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇన్‌స్టెంట్ మ్యాగీ నూడుల్స్‌లో అధిక శాతం సీసం ఉన్నట్టు, ఇది చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు యూపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ సరుకును వాపసు తీసుకోవలసిందిగా ఉత్తరప్రదేశ్‌లోని ఆహార భద్రతా, ఔషధ నియంత్రణ విభాగం(ఎఫ్‌డీఏ) అధికారులు ఆ బ్రాండ్‌ను తయారు చేసే నెస్లే ఇండియాను ఆదేశించారు. కొన్ని షాపులలోని మ్యాగీ నూడుల్స్ రెండు డజన్ల ప్యాకెట్లను ఒక ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించి చూడగా వాటిలో సీసపు పదార్థం అనుమతించదగిన స్థాయికన్నా దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉందని యూపీ ఎఫ్‌డీఏ విభాగ డీఐజీ శ్రీవాస్తవ తెలిపారు. ఈ బ్యాచ్‌లో తయారైన ఇన్‌స్టెంట్ నూడుల్స్ అన్నీ విషపూరితమయ్యాయనీ, వీటిలో సీసపు సాంద్రత 17.2 పీపీఎంగా నమోదయ్యిందని ఆయన అన్నారు. సాధారణంగా సీసపు పదార్థం 0.01-2.5 పీపీఎం రేంజిలో ఉంటే ఫర్వాలేదని ఆయన చెప్పారు. రుచి కోసం అధిక మోతాదులో మోనోసోడియం గ్లుటోమేట్‌ను(ఎంఎస్‌జీ) వినియోగించినట్లు కూడా పరీక్షలలో తేలినట్లు శాస్త్రజ్ఞులు చెప్పారు. కాగా, కంపెనీ ప్రతినిధి ఈ వార్తను ధ్రువీకరించారు. 2014 మార్చి బ్యాచ్‌లో తయారైన మ్యాగ్గీ నూడిల్స్ ప్యాకెట్ల ఉపసంహరించుకుంటున్నామని, అయితే వీటిలో చాలా సరుకు ఇప్పటికే వినియోగించేశారని అన్నారు.
Advertisement