హీరోయిన్ లేకుండ ర‌జ‌నీకాంత్..! 

విక్ర‌మ్ సింహా, లింగ చిత్రాలు డిజాస్ట‌ర్ అయిన త‌రువాత  ఒక మంచి చిత్రం చేసి బౌన్స్ బ్యాక్ కావాల‌ని  ఆలోచ‌న చేస్తున్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. దీంతో   ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రెండంటే రెండే సినిమాలు చేసిన  రంజిత్ అనే ద‌ర్శ‌కుడితో చేయ‌డానికి సిద్దం అయ్యారు. ఇదంతా బాగానే వుంది కానీ…  ర‌జ‌నీకాంత్ ఆ ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్న సినిమాలో  హీరోయిన్ అవ‌స‌రం వుండ‌ద‌ట‌.  ర‌జనీకాంత్ ను ఒక గ్యాంగ్ స్ట‌ర్ గా చూపించ నున్నార‌ట‌.  ఎంత గ్యాంగ్ […]

Advertisement
Update:2015-05-20 06:47 IST

విక్ర‌మ్ సింహా, లింగ చిత్రాలు డిజాస్ట‌ర్ అయిన త‌రువాత ఒక మంచి చిత్రం చేసి బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఆలోచ‌న చేస్తున్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. దీంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రెండంటే రెండే సినిమాలు చేసిన రంజిత్ అనే ద‌ర్శ‌కుడితో చేయ‌డానికి సిద్దం అయ్యారు. ఇదంతా బాగానే వుంది కానీ… ర‌జ‌నీకాంత్ ఆ ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్న సినిమాలో హీరోయిన్ అవ‌స‌రం వుండ‌ద‌ట‌. ర‌జనీకాంత్ ను ఒక గ్యాంగ్ స్ట‌ర్ గా చూపించ నున్నార‌ట‌. ఎంత గ్యాంగ్ స్ట‌ర్ అయిన‌ప్ప‌టికి హీరోయిన్ లేకుండా.. సినిమా అంతా ర‌జ‌నీకాంత్ తోనే క‌థ న‌డిపించాల‌నే ఆలోచ‌న చేయ‌డం నిజంగా డైరెక్ట‌ర్ కు పెద్ద స‌వాల్ అంటున్నారు ప‌రిశీకులు. ఆయ‌న అభిమానులు ఒకింత ఆందోళ‌న ప‌డుతున్నారు. క‌థ మీద ఎంతో కాన్ఫిడెన్స్ వుంటే త‌ప్ప‌.. ర‌జ‌నీకాంత్ కూడా ఇటువంటి డేరింగ్ స్టెప్ తీసుకోరు అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. ఏది ఏమైనా ర‌జ‌నీకాంత్ 65 ఏళ్ల వ‌య‌సులో ఇటువంటి ప్ర‌యోగాలు చేస్తుండ‌టం నిజంగా గ్రేట్ క‌దా..!

Tags:    
Advertisement

Similar News