జర నవ్వండి ప్లీజ్ 86
చరణ్: నేనూ పులీ ఎదురెదురుగా నిల్చున్న సంగతి చెప్పానా? వరుణ్: అరే! చెప్పలేదే! చరణ్: అది గాండ్రించింది. నేను ఇటూ అటూ కదల్లేదు. దాని కోరలు చాచింది. నేను ఏమాత్రం భయపడలేదు. పంజా ఎత్తి నా మీదికి ఎగబడింది. వరుణ్: (ఆతృతగా) తరువాత ఏమైంది? చరణ్: నేను పక్కబోను దగ్గరికి వెళ్ళిపోయాను. ————————— కిరణ్: డాక్టర్! నేను నిద్రలేచిన తరువాత అరగంట సేపు మత్తుగా, తల తిరిగినట్లుంటుంది. ఏం చెయ్యమంటారు? డాక్టర్: అరగంట ఆలస్యంగా నిద్రలేవండి. ————————— […]
చరణ్: నేనూ పులీ ఎదురెదురుగా నిల్చున్న సంగతి చెప్పానా?
వరుణ్: అరే! చెప్పలేదే!
చరణ్: అది గాండ్రించింది. నేను ఇటూ అటూ కదల్లేదు. దాని కోరలు చాచింది. నేను ఏమాత్రం భయపడలేదు. పంజా ఎత్తి నా మీదికి ఎగబడింది.
వరుణ్: (ఆతృతగా) తరువాత ఏమైంది?
చరణ్: నేను పక్కబోను దగ్గరికి వెళ్ళిపోయాను.
—————————
కిరణ్: డాక్టర్! నేను నిద్రలేచిన తరువాత అరగంట సేపు మత్తుగా, తల తిరిగినట్లుంటుంది. ఏం చెయ్యమంటారు?
డాక్టర్: అరగంట ఆలస్యంగా నిద్రలేవండి.
—————————
పదిగంటల రాత్రిలో నవీన్ చీకటి సందులో వెళుతున్నాడు. ఇద్దరు దొంగలు మీద పడ్డారు. నవీన్ వాళ్ళతో బాగా పోట్లాడాడు. కానీ చివరకు దొంగలు అతని జేబులు వెతికి ఒక రూపాయి బిళ్ళ తీసారు.
దొంగ: ఈ రూపాయి కోసం మాతో ఇంతసేపు పోట్లాడాలా?
నవీన్: కాదు, నా బూట్లలో దాచిన రెండువందల కోసం!
—————————
కరణ్ యాక్సిడెంటై గాయపడ్డాడు.
అంబెలెన్స్ అతను: “అబ్బాయి! నీ పేరు చెప్పు. దానివల్ల మీ వాళ్ళకు తెలియజేసే అవకాశం ఉంటుంది.
కరణ్: మా వాళ్ళకు ఎప్పుడో నా పేరు తెలుసు.