22న సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం
చెన్నై: అక్రమాస్తుల కేసుల నుంచి విముక్తి పొందిన తమిళనాడు అన్నాడీఎంకె అధినేత జయలలిత ఈ నెల 22న ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలోని ముఖ్యులందరికీ తెలియజేశారు. జయ ప్రమాణ స్వీకారాన్ని పోయెస్ గార్డెన్ వర్గాలు ధ్రువీకరించాయి. అదే రోజు ఉదయం ఏడున్నర గంటలకు ఎమ్మెల్యేలందరితో అన్నాడీఎంకె ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతున్నారు. ఆమెను శాసనసభ పక్ష నేతగా అక్కడ ఎన్నుకున్న తర్వాత జయ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమం అవుతుంది. అయితే ఇంక […]
Advertisement
చెన్నై: అక్రమాస్తుల కేసుల నుంచి విముక్తి పొందిన తమిళనాడు అన్నాడీఎంకె అధినేత జయలలిత ఈ నెల 22న ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలోని ముఖ్యులందరికీ తెలియజేశారు. జయ ప్రమాణ స్వీకారాన్ని పోయెస్ గార్డెన్ వర్గాలు ధ్రువీకరించాయి. అదే రోజు ఉదయం ఏడున్నర గంటలకు ఎమ్మెల్యేలందరితో అన్నాడీఎంకె ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతున్నారు. ఆమెను శాసనసభ పక్ష నేతగా అక్కడ ఎన్నుకున్న తర్వాత జయ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమం అవుతుంది. అయితే ఇంక యేడాది మాత్రమే అసెంబ్లీకి గడువు ఉన్నందున జయ ఆరు నెలలలోగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజునే ఎవరో ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఎన్నిక నిర్వహణకు వీలవుతుందని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలన్నదానిపై జయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె ఎన్నికకు ఇష్టపడని పక్షంలో ఆరు నెలల ముందే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చు.
Advertisement