జర నవ్వండి ప్లీజ్ 83
టీచర్: సూర్యుడు గొప్పా? చంద్రుడు గొప్పా? వేణు: చంద్రుడే టీచర్! టీచర్: ఎందుకని? వేణు: రాత్రిపూట చీకటిగా వున్నప్పుడు చంద్రుడు వచ్చి కాంతినిస్తాడు. పగటి పూట కాంతి వున్నప్పుడు అనవసరంగా సూర్యుడు వచ్చి వెలుతిరిస్తాడు. ———————————————————- శరత్: పొద్దున నువ్వు ఆఫీసుకు సైకిల్ తోసుకుంటూ వెళుతున్నావ్? రవి: అప్పటికే టైమయిపోయింది. సైకిల్ ఎక్కే టైములేక? ———————————————————- ఖాతాదారు: నేనీ బ్యాంక్‌లో లక్షరూపాయలు జమ చేశాను. ఇప్పుడు బ్యాంక్ దివాలా తీసిందంటున్నారు! నేను బతకడం వేస్టు. మేనేజర్: నన్నేం […]
టీచర్: సూర్యుడు గొప్పా? చంద్రుడు గొప్పా?
వేణు: చంద్రుడే టీచర్!
టీచర్: ఎందుకని?
వేణు: రాత్రిపూట చీకటిగా వున్నప్పుడు చంద్రుడు వచ్చి కాంతినిస్తాడు. పగటి పూట కాంతి వున్నప్పుడు అనవసరంగా సూర్యుడు వచ్చి వెలుతిరిస్తాడు.
———————————————————-
శరత్: పొద్దున నువ్వు ఆఫీసుకు సైకిల్ తోసుకుంటూ వెళుతున్నావ్?
రవి: అప్పటికే టైమయిపోయింది. సైకిల్ ఎక్కే టైములేక?
———————————————————-
ఖాతాదారు: నేనీ బ్యాంక్‌లో లక్షరూపాయలు జమ చేశాను. ఇప్పుడు బ్యాంక్ దివాలా తీసిందంటున్నారు! నేను బతకడం వేస్టు.
మేనేజర్: నన్నేం చెయ్యమంటారో చెప్పండి.
ఖాతాదారు: నేను రేపు బ్యాంక్‌ముందు ఆత్మహత్య చేసుకోబోతున్నాను. హైదరబాద్‌లో వున్న లక్షల జనం అది చూడడానికి వస్తారు.
మేనేజర్: (తాపీగా) ఎంట్రెన్స్ టికెట్ ఎంత పెట్టమంటారు?
———————————————————-
ఇద్దరు హిప్పీలు ఒక రెస్టారెంట్‌కు వచ్చారు. తలుపు దగ్గరున్న అతను “టై లేకుండా హోటల్‌లోకి అనుమతించరు” అన్నాడు. హిప్పీలలో మొదటివ్యక్తి సరే అని బయటికి వెళ్ళి కాసేపటికి టై కట్టుకుని వచ్చాడు. ఇద్దరూ రెస్టారెంట్‌కి వెళుతూ వుంటే గేటుకీపర్ “మరి ఆ రెండో అతని సంగతేమిటి?” అన్నాడు. మొదటి హిప్పీ “ఆమె నా భార్య” అన్నాడు.
———————————————————-
విమానం వెళుతోంది.
ఒక కుర్రాడు లేచి అల్లరి చేసుకుంటూ ఆడుకుంటున్నాడు. ఎక్కడో ఆలోచిస్తున్న తల్లి “సంజీ! అల్లరి చెయ్యకుండా బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పాను కదా” అంది.