అన్నిటికన్నా గొప్పది (Devotional)

వీరేశం మహాభక్తుడు. దేవుడి పటానికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేసేవాడు. శ్రద్ధగా ప్రార్థనలు చేసేవాడు. అతని భక్తిని చూసిన ఒక మిత్రుడు సంతోషించి ఒక శివలింగాన్ని ఇచ్చి శ్రద్ధగా ఈ శివలింగానికి పూజలు చెయ్యి, నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరతాయి అన్నాడు             వీరేశం శివలింగాన్ని ఎంతో భక్తితో పూజిస్తూ ప్రపంచంలో అన్నిటి కన్నా గొప్పది శివలింగమే అనుకున్నాడు. దీపధూపాలతో బాటు రోజూ శివలింగానికి ఒక అరటిపండు సమర్పించేవాడు. తెల్లవారి లేచి చూస్తే ఆ అరటిపండు కనిపించేది […]

Advertisement
Update:2015-05-13 18:31 IST

వీరేశం మహాభక్తుడు. దేవుడి పటానికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేసేవాడు. శ్రద్ధగా ప్రార్థనలు చేసేవాడు. అతని భక్తిని చూసిన ఒక మిత్రుడు సంతోషించి ఒక శివలింగాన్ని ఇచ్చి శ్రద్ధగా ఈ శివలింగానికి పూజలు చెయ్యి, నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరతాయి అన్నాడు

వీరేశం శివలింగాన్ని ఎంతో భక్తితో పూజిస్తూ ప్రపంచంలో అన్నిటి కన్నా గొప్పది శివలింగమే అనుకున్నాడు. దీపధూపాలతో బాటు రోజూ శివలింగానికి ఒక అరటిపండు సమర్పించేవాడు. తెల్లవారి లేచి చూస్తే ఆ అరటిపండు కనిపించేది కాదు. “ఆహా! దేవుడు నా భక్తికి మెచ్చి అరటి పండురోజూ తింటున్నాడు” అని వీరేశం తెగ ఆనందపడిపోయాడు.

ఒక రోజు దేవుడికి అరటిపండు సమర్పించి పక్క గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి శివలింగానికి మళ్లీ నమస్కరించాలని బుద్ధిపుట్టి పూజాగదిలోకి వచ్చాడు. అప్పుడే ఒక ఎలుక వచ్చి అరటిపండును తినడం కనిపించింది. ఆదృశ్యం చూసి వీరేశానికి జ్ఞానోదయమయినంత పనయింది. పొరపాటున ఇన్నాళ్ళు శివలింగం గొప్పదనుకున్నాను. శివలింగం తినలేని అరటిపండును ఎలుక తింటోంది. కాబట్టి ఎలుకే శివలింగం కన్నా గొప్పది అని నిర్ణయించుకుని ఎలుకను పూజించడం మొదలుపెట్టాడు. వీరేశం ఏమీ అనకపోయేసరికి ఎలుక స్వేచ్ఛగా వచ్చి అరటిపండు భోంచేసి వెళ్ళేది. అది వచ్చినపుడు వీరేశం చేతులు జోడించి ప్రార్థించేవాడు.

వీరేశం ఒకరోజు ఎలుక ప్రార్థనలోవుంటే పక్క గదిలోంచీ దూసుకొచ్చిన పిల్లిని చూసి ప్రాణభయంతో ఎలుక పారిపోయింది. ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన వీరేశం ఆ దృశ్యాన్ని చూసి ఎలుక కాదు పిల్లే అన్నిటికన్నా గొప్పదని పిల్లికి నమస్కరించి దానికి రోజూ పళ్ళూ పాలూ సమర్పించి ప్రార్థించడం మొదలు పెట్టాడు. వీరేశం కొడుకు వెంట ఒక రోజు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క పిల్లిని చూసి తరిమింది. పిల్లి భయంతో గోడదూకి పారిపోయింది. ఈ మహత్తర దృశ్యం చూసిన వీరేశం అందరికన్నా గొప్పదేవుడు కుక్కే అని ఆ కుక్కకు నమస్కరించి దానికి అన్నం పెట్టి దాని పాదాలకు నమస్కరించాడు. ఒక రోజు ఆ కుక్క ఒంటింట్లోకి వెళ్ళి గిన్నెలోని అన్నం తింటూ ఉండడం చూసి వీరేశం భార్య కట్టె తీసుకుని కొట్టింది. ఆ దెబ్బతో కుక్క కుయ్యో మొర్రో అంటూ అరచుకుంటూ కుంటుకుంటూ వీధిలోకి పరిగెత్తింది.

ఈ దృశ్యం చూసిన వీరేశం వింత అంటేయిదే కదా! కుక్క కాదు అసలు దైవం నా భార్య అని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. భర్త తత్వం తెలిసిన ఆమె పట్టించుకోలేదు. ఒకరోజు భార్య ఎంత సేపటికీ వంట ముగించలేదు. వీరేశంకు ఆకలి ఎక్కువైంది. కోపం వచ్చి కర్ర తీసుకుని ఆమెను కొట్టబోయి ఆగి ఆలోచనలో పడ్డాడు. నా భార్య కన్నా గొప్పవాణ్ణి నేనే. అంతేకాదు. అసలు దేవుణ్ణి నేనే! అని అద్దంలో తనకు తను నమస్కరించి తనని తనే పూజించుకున్నాడు. కానీ ఇదంతా ఆకలి వల్ల వచ్చింది. ఆకలి కడుపులో ఉంది. కాబట్టి అసలు దైవం కడుపే అనుకుని కడుపుకు నమస్కరించడం మొదలుపెట్టాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News