జర నవ్వండి ప్లీజ్ 81

కౌసల్య: నా జబ్బు ఎప్పటికి బాగుపడుతుందంటారు డాక్టర్‌! డాక్టర్‌: మీరు సీరియల్స్‌ చూడ్డం మానేశాక. ————————————– కస్టమ్స్‌ ఆఫీసర్‌ అతన్ని నిలదీసి “ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి?” అని అడిగాడు. ఆనంద్‌: అది భక్తిరసం. అంటే గంగాజలం. పవిత్రమైంది అన్నాడు. కస్టమ్స్‌ ఆఫీసర్‌ బాటిల్‌ తీసి తొంగి చూశాడు. “ఇది విస్కీలా వాసన వేస్తోంది. విస్కీలాంటి రుచివేస్తూంది” అన్నాడు. ఆనంద్‌: “చూశారా? భగవంతుడు చేసే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి” అన్నాడు. ————————————– సినిమా మొదలయింది. ఉత్సాహం […]

Advertisement
Update:2015-05-12 18:33 IST

కౌసల్య: నా జబ్బు ఎప్పటికి బాగుపడుతుందంటారు డాక్టర్‌!
డాక్టర్‌: మీరు సీరియల్స్‌ చూడ్డం మానేశాక.
————————————–
కస్టమ్స్‌ ఆఫీసర్‌ అతన్ని నిలదీసి “ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి?” అని అడిగాడు.
ఆనంద్‌: అది భక్తిరసం. అంటే గంగాజలం. పవిత్రమైంది అన్నాడు.
కస్టమ్స్‌ ఆఫీసర్‌ బాటిల్‌ తీసి తొంగి చూశాడు.
“ఇది విస్కీలా వాసన వేస్తోంది. విస్కీలాంటి రుచివేస్తూంది” అన్నాడు.
ఆనంద్‌: “చూశారా? భగవంతుడు చేసే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి” అన్నాడు.
————————————–
సినిమా మొదలయింది. ఉత్సాహం కలిగించే సీను మొదలయింది. స్క్రీను ముందు వరసలో కూర్చున్న ఒకతను విపరీతమైన ఆవేశంతో అరుస్తున్నాడు. హీరో విలన్‌ని విపరీతంగా కొడుతున్నాడు. ఆ ప్రేక్షకుడు లేచి “కొట్టు, వెధవని వదిలి పెట్టొద్దు. విరిచెయ్‌! కాలో, చెయ్యాలవిరిచెయ్‌!” అని కేకలు పెడుతున్నాడు. ఈ గొడవ తెలుసుకున్న మేనేజర్‌ వచ్చి “నడు! బయటకి నడు! ఎవరయ్యా నువ్వు! జనాల్ని సినిమా చూడనీకుండా గొడవ పెడుతున్నావు! ఇంతకూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు” అన్నాడు.
గొడవ పెట్టే అతను “బాల్కనీ నించి వచ్చాను” అన్నాడు.
————————————–
టీచర్‌: ఈ నోట్‌బుక్‌లో సిగ్నేచర్‌ మీ ఫాదర్‌దేనా?
విక్రం: అవును టీచర్‌! కావాలంటే లాస్ట్‌పేజ్‌లో చూడండి. ఎంతగా ప్రాక్టీసు చేశానో తెలుస్తుంది.

Tags:    
Advertisement

Similar News