ఉత్తరాదిలో మళ్ళీ భారీ భూప్రకంపనలు
నేపాల్‌లో ప్రకృతి భీభత్సం మరువక ముందే మరోసారి ఉత్తరాదిని భూప్రకంపనలు జనాన్ని వణికించాయి. ఢిల్లీ, హర్యానా, బీహార్, బెంగాల్‌లో ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో వణికించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. ఒక నిమషం పాటు కంపనలు రావడంతో జనం ఇళ్ళ నుంచి ఆఫీసుల నుంచి పరుగులు తీశారు. ఇది ఖాట్మండు కేంద్రంగా వచ్చిందని కొంతమంది, ఆఫ్గాన్ కేంద్రంగా వచ్చిందని కొంతమంది చెబుతుండడంతో దీని తీవ్రత ఏ ప్రాంతంలో ఎలా ఉందో ఇంకా […]
Advertisement
నేపాల్‌లో ప్రకృతి భీభత్సం మరువక ముందే మరోసారి ఉత్తరాదిని భూప్రకంపనలు జనాన్ని వణికించాయి. ఢిల్లీ, హర్యానా, బీహార్, బెంగాల్‌లో ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో వణికించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. ఒక నిమషం పాటు కంపనలు రావడంతో జనం ఇళ్ళ నుంచి ఆఫీసుల నుంచి పరుగులు తీశారు. ఇది ఖాట్మండు కేంద్రంగా వచ్చిందని కొంతమంది, ఆఫ్గాన్ కేంద్రంగా వచ్చిందని కొంతమంది చెబుతుండడంతో దీని తీవ్రత ఏ ప్రాంతంలో ఎలా ఉందో ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా ప్రకంపనలు కనిపించాయి. విశాఖ, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, భీమవరం, కాకినాడ, కోనసీమ ప్రాంతాలలో ఓ ఏడెనిమిది సెకండ్లపాటు ఈ కంపనలు కలిగినట్టు గుర్తించారు. విజయవాడలో బెంజి సర్కిల్, పడమట లంక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు రికార్డు కావడంతో జనం భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే వీటి గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేపాల్‌లో వచ్చిన భూకంపం పెద్ద ఎత్తున ఉండడం వల్ల దాని ప్రభావం రెండు మూడు నెలలు ఉంటుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
Advertisement