సల్మాన్ అభిమానుల్లో ఆశలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషిగా బయటికి రావడం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. జయ కేసులో విచారణ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని హైకోర్టు అభిప్రాయపడటం ఇందుకు కారణం. హిట్ అండ్ రన్ కేసులో గతవారం సల్మాన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళన చెందిన సల్మాన్ అదేరోజు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ లభించింది. […]
Advertisement
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషిగా బయటికి రావడం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. జయ కేసులో విచారణ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని హైకోర్టు అభిప్రాయపడటం ఇందుకు కారణం. హిట్ అండ్ రన్ కేసులో గతవారం సల్మాన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళన చెందిన సల్మాన్ అదేరోజు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ లభించింది. రెండురోజుల అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ పరిణామం సల్మాన్ కుటుంబానికి, అభిమానులకు ఎంతో ఊరటనిచ్చింది. తిరిగి సాగనున్న విచారణలో అంత భారీగా శిక్ష ఉండకపోవచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు. సల్మాన్‌పై ఇప్పటికే రూ.200 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాతలు సైతం హైకోర్టులో సల్మాన్‌కు ఈసారి భారీ శిక్ష పడకపోవచ్చని గంపెడాశతో ఉన్నారు. సెషన్స్ కోర్టు తీర్పు రద్దు కావడం అభిమానులు, నిర్మాతల ఆశలను సజీవంగా ఉంచింది.
Advertisement